
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ స్పష్టం చేశారు.
బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. బ్రెజిల్, జపాన్, జర్మనీతోపాటు ఆఫ్రికా నుంచి రెండు దేశాల అభ్యర్థిత్వానికి కూడా మాక్రన్ మద్దతు పలికారు.
‘‘భద్రతా మండలిని విస్తరించి, బలోపేతం చేద్దాం. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉంది. ఆఫ్రికాలోని రెండు దేశాలతో పాటు జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ కు చోటు ఇవ్వాలి” అని ఆయన సూచించారు.