ఒలింపిక్ క్రీడల వేళ.. పారిస్లో రైళ్లు మొత్తం బంద్ ..క్రీడాకారులకు ఇబ్బందులు

ఒలింపిక్ క్రీడల వేళ.. పారిస్లో రైళ్లు మొత్తం బంద్ ..క్రీడాకారులకు ఇబ్బందులు

ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న వేళ ఫ్రాన్స్ లో అన్ని రైళ్లు నిలిచిపోయాయి. ఒలింపిక్స్ క్రీడలు  కొన్ని గంటల్లో ప్రారంభం అవుతాయన్న సమయంలో గురువారం (జూలై 25,2024 ) అర్థరాత్రి రైల్వే వ్యవస్థకు చెందిన కేబుల్ సిస్టమ్ మొత్తం కాలిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు దేశ విదేశాలనుంచి వచ్చిన క్రీడాకారులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు.  అయితే క్రీడాకారులు, ఫ్రాన్స్ ప్రజలకు ప్రత్యామ్నాయంగా రవాణా ఏర్పాట్లు చేసినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు చెప్పారు. 
 
పారిస్లో శుక్రవారం జూలై26, 2024న పారీస్ లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే పారీస్ లోని హైస్పీడ్ రైల్వే వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఫ్రెంచ్ రైల్వే కంపెనీSNCF, దాని TGVనెట్ వర్క్ కు సంబంధించి కేబుల్ వ్యవస్థ దగ్ధమైంది. కేబుల్ వ్యవస్థ కాలిపోవడానికి కారణాలు ఇంకా తెలిసిరాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇది ఒక దుశ్చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో రైళ్లన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు రైల్వే కేబుల్ వ్యవస్థ కాలిపోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫ్రాన్స్ నేషనల్ పోలీసులు తెలిపారు.  అట్లాంటిక్, ఫ్రాన్స్ కు ఉత్తర, తూర్పుమార్గాల్లో  ఫ్రెంచ్ రైల్వే కంపెనీ దాని TGV నెట్ వర్క్ కేబుల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమయ్యింది.  రద్దీగా ఉంటే ఫ్రెంచి పశ్చిమ మార్గంలో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫ్రెంచ్ మీడియా సంస్థలు వెల్లడించాయి. 

రైల్వే నెట్ వర్క్ వ్యవస్థ ధ్వంసంపై ఫ్రాన్స్ మంత్రులు స్పందించారు. ఒలింపిక్స్ క్రీడలకు కొన్ని గంటల ముందు జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనకు క్రీడలకు లింక్  ఉన్నట్లు స్పష్టత ఇవ్వలేదు. ఏం జరిగిందో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు జాతీయ పోలీసులు చెప్పారు.  ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు.  

అయితే రైళ్ల రాకపోకలకు అంతరాయం కారణంగా ప్రయాణికులు, క్రీడాకారులు ఇబ్బంది పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని  ఫ్రాన్స్ క్రీడల మంత్రి అమేలీ ఔడియా కాస్టెరా చెప్పారు. ఒలింపిక్స్ కోసం వచ్చిన ప్రతినిధులను ఈవెంట్ ప్రదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.