
తమిళనాడులో దారుణం జరిగింది. తిరువణ్ణామలైలో ఫ్రెంచ్ టూరిస్టుపై గైడ్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన బుధవారం ( మార్చి19) చోటు చేసుకుంది. తిరువణ్ణామలైలో నిషేధిత ప్రాంతమైన దీపమలై కొండపై మెడిటేషన్ చేసేందుకు వెళ్లిన తనపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చికిత్స కోసం బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు.
ఫ్రాన్స్ కు చెందిన 46 యేళ్ల మహిళ 2025 జనవరిలో తిరువణ్ణామలైకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆశ్రమంలోఉంటుంది. అయితే టూరిస్టు గైడ్ , మరికొంతమందితో కలిసి మెడిటేషన్ కోసం దీపమలై కొండపైకి వెళ్లింది. ఓ గుహను మెడిటేషన్ చేస్తుండగా టూరిస్ట్ గైడ్ వెంకటేశన్ తనపై అత్యాచారం చేశాడని, తప్పించుకొని వచ్చిన తిరువణ్ణామలై వెస్ట్ పోలీసులకు ఫ్రెంచ్ టూరిస్టు ఫిర్యాదు చేసింది.కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ | మినీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురు ఉద్యోగులు సజీవ దహనం
పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై, అన్నామలైయర్ ఆలయం, రమణమహర్షి ఆశ్రమంతో సహా 14 పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మేల్కొలుపు కోరుకునే విదేశీయులు ఈ ప్రాంతాన్ని ఉత్తమంగా భావిస్తారు. చాలామంది ఈ జిల్లాలో ఎక్కువ కాలం ఉండిపోతారు. ఈ ఘటనలో తిరువణ్ణమలై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టూరిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.