గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో తరచూ తాగునీటి ఇబ్బందులు

  •     సమస్యల గుర్తింపు కోసం ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ కమిటీ వేసిన కేటీఆర్‌‌‌‌
  •     పూర్తి కాని లోపాల గుర్తింపు
  •     విడతల వారీగా కార్పొరేటర్లతో మీటింగ్‌‌‌‌లు, ఫీల్డ్‌‌‌‌ విజిట్‌‌‌‌లు
  •     కొలిక్కిరావడానికి మరో 2 నెలలు పట్టే చాన్స్‌‌

హనుమకొండ, వెలుగు: గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో తరచూ ఏర్పడుతున్న తాగునీటి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ కమిటీని వేసి నెల రోజులుగా స్టడీ చేస్తున్నా.. కార్పొరేట్లతో మీటింగ్‌‌‌‌లు నిర్వహిస్తున్నా సమస్యల గుర్తింపు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎండాకాలం మొదలైనప్పటికీ ఇంకా సమస్యలు గుర్తించే పనిలోనే ఉంటే వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

నెల రోజులుగా స్టడీ చేస్తున్రు

గత నెల మొదటివారంలోనే వరంగల్‌‌‌‌ నగరంలో నీటి ఎద్దడి తలెత్తింది. దేవాదుల నీరు రాకపోవడంతో ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ అడుగంటడం, బటర్‌‌‌‌ ఫ్లై వాల్వ్‌‌‌‌ల రిపేర్లు, డిస్ట్రిబ్యూటరీ పైప్‌‌‌‌లైన్ల లీకేజీల కారణంగా 10 రోజుల పాటు నీళ్లకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్య మంత్రి కేటీఆర్‌‌‌‌ దృష్టికి వెళ్లడంతో ఇటీవల ఉమ్మడి జిల్లా లీడర్లతో సమావేశమయ్యారు. వరంగల్‌‌‌‌లో తరచూ తలెత్తుతున్న వాటర్‌‌‌‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హైదరాబాద్‌‌‌‌ మెట్రో వాటర్‌‌‌‌ బోర్డు రిటైర్డ్ సీఈ రవికుమార్‌‌‌‌ను పంపించారు. దీంతో గత నెల 14న నగరానికి వచ్చిన ఆయన మేయర్‌‌‌‌ గుండు సుధారాణి, మున్సిపల్, పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ఇంజినీర్లతో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. తర్వాత మున్సిపల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌ కూడా నగరానికి వచ్చారు. అనంతరం రిటైర్డ్‌‌‌‌ సీఈ రవికుమార్, గ్రేటర్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ ప్రవీణ్‌‌‌‌ చంద్ర, ఇతర ఆఫీసర్లు ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి చెరువులను సందర్శించారు. వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేట ఫిల్డర్‌‌‌‌ బెడ్లను పరిశీలించారు. దాదాపు నెల రోజుల నుంచి స్టడీ చేస్తూనే ఉన్న సమస్యల గుర్తింపు మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్‌‌‌‌ కాలేదు.

డివిజన్ల వారీగా మీటింగ్‌‌‌‌లు 

గ్రేటర్​వరంగల్‌‌‌‌ పరిధిలో 66 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్‌‌‌‌లో లీకేజీలు, వాల్వ్‌‌‌‌ల ప్రాబ్రమ్‌‌‌‌, వాటర్‌‌‌‌ ఫ్లో తక్కువగా ఉండడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు రిజర్వాయర్లు, ఫిల్టర్‌‌‌‌ బెడ్లు, మెయిన్‌‌‌‌ పైప్‌‌‌‌లైన్లను పరిశీలించిన ఆఫీసర్లు, ఇప్పుడు క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రతివారం ఐదారు డివిజన్ల కార్పొరేటర్లతో మేయర్, ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ మెంబర్స్​మీటింగ్‌‌‌‌ పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఫీల్డ్‌‌‌‌ విజిట్‌‌‌‌ చేసి సమస్యలను నోటిఫై చేస్తున్నారు. అయితే అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో మీటింగ్‌‌‌‌లు పూర్తై, సమస్యలు గుర్తించేందుకు ఇంకా రెండు నెలలైనా పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎండాకాలంలో నీళ్లకు తిప్పలే..

ఇప్పటికే ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. నగరంలో అక్కడక్కడా రెండు, మూడు రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ కమిటీ సమస్యలను గుర్తించడం, ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేయడం, టెండర్లు, పైప్‌‌‌‌లైన్ల రీప్లేస్‌‌‌‌, లీకేజీలు అరికట్టడం వంటి పనులు చేసేందుకు చాలా టైం పడుతుంది. దీంతో ఈ వేసవిలోనూ తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.