కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చు మొదలైంది.. ఐదు చోట్ల కొత్తగా మంటలు వ్యాపించాయి.. ఈ మంటలు సెకను సెకనుకు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. 2025, జనవరి 23వ తేదీ కొత్తగా మొదలైన మంటలు..10 వేల ఎకరాలకు వ్యాపించాయి. ఐదు చోట్ల కొత్తగా మంటలు పుట్టుకొచ్చాయని కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ఈ మంటలతో..10 వేల ఇళ్లకు ముప్పు పొంచి ఉందని.. వెంటనే ఆయా ప్రాంతాల్లోని జనం ఖాళీ చేసి వెళ్లిపోవాలని కాలిఫోర్నియా గవర్నర్ ప్రకటించారు.
కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మంటలకు గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంలో లాస్ ఏంజిల్స్ లోని ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. కాలిఫోర్నియాలోని కాస్టాయిక్‌లోని కాస్టయిక్ సరస్సు వెంబడి హ్యూస్ ఫైర్ కారణంగా మంటలు వ్యాపించాయి. వెంటనే ఫైర్ ఫైటర్లు మంటలనుఅదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు.
బుధవారం (జనవరి22,2025) ఉదయం చెలరేగిన హ్యూస్ ఫైర్, ఎండిపోయిన వృక్షాలు, వేగవంతమైన గాలులతో వేగంగా వ్యాపించింది. దీంతో దట్టమైన పొగతో ఆ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి.
ప్రముద్ద పర్యాటక కేంద్రం అయిన లేక్ కాస్టాయిక్ సమీపంలో మంటలు చెలరేగాయి. కొన్ని గంటల్లో నే హ్యూస్ ఫైర్ 39 చదరపు కిలోమీటర్లు అడవిని దహించి వేసింది. దాదాపు 31 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 23వేల మంది స్థానికులను ఖాళీ చేయాలని హెచ్చిరించారు.
కామరిల్లో, ఫిల్ మోర్, మూర్ పార్క్, ఆక్సాన్నార్డ్, పీరు, శాంటాపౌలా, సిమివ్యాలీ, వెంచూరా, ఫెర్నాండో వ్యాలీ, శాంటాక్లారిటీ, కాస్టయిక్ లేక్ ప్రాంతాలకు మంటల ముప్పు పొంచి ఉందని.. దట్టమైన పొగ వ్యాపిస్తుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొత్త మంటలు పుట్టుకొచ్చిన వెంటనే.. 4 వేల మంది ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించింది ప్రభుత్వం.
ఇంటర్ స్టేట్5 మూసివేత
కార్చిచ్చు విస్తరిస్తుండటంతో కాలిఫోర్నియా ప్రధాన రహదారుల్లో ఒకటైన ఇంటర్ స్టేట్5 ని మూసివేశారు. ఇది మెక్సికో నుంచి కెనడా వరకు యూఎస్ పసిఫిక్ తీరాన్ని కలుపుతుంది. దీనిని 30 మైళ్ల మేర మూసివేశారు. హ్యూస్ ఫైర్ కొండపైకి వెళ్లి చెట్లతో కూడిన లోయలలోకి దిగింది. నేలపై ఉన్న అగ్నిమాపక సిబ్బంది, విమానం నీటిని వదలడం ద్వారా, మంటలు కాలిఫోర్నియాలోకి దూకకుండా కాస్టైక్‌తో సహా సమీపంలోని కమ్యూనిటీలను వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.