
ప్రతివారం లాగే ఈ వారం కూడా (ఏప్రిల్ మూడో వారం) ఓటీటీల్లో కొత్త సినిమాలొచ్చి సందడి చేస్తున్నాయి. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు జోనర్స్ లో సినిమాలొచ్చాయి.
అందులో ఈ వారం తెలుగులో ఓ 5 ఆసక్తికర సినిమాలున్నాయి. ఒకటి తెలుగు బాక్సాఫీస్ హిట్ కామెడీ మూవీ కాగా మిగతావి తెలుగు డబ్బింగ్‍లో వచ్చి ఆకట్టుకున్నవి ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే వివరాలు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
మ్యాడ్ స్క్వేర్ (తెలుగు కామెడీ మూవీ)- ఏప్రిల్ 25
హావోక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్)- ఏప్రిల్ 25
వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25
జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్ (హిందీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్)- ఏప్రిల్ 25
ఆహా:
యాత్తి సాయి (తెలుగు యాక్షన్ వార్ డ్రామా)- ఏప్రిల్ 25
అమెజాన్ ప్రైమ్:
వీర ధీర శూర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- ఏప్రిల్ 24న
నిరమ్ మారుమ్ ఉలగిల్ (తమిళ అంథాలజీ క్రైమ్ ఎమోషనల్ డ్రామా)- ఏప్రిల్ 25
సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (రియల్ స్టోరీ విలేజ్ హిందీ డ్రామా)- ఏప్రిల్ 25
జియో హాట్ స్టార్:
L2 ఎంపురాన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్)- ఏప్రిల్ 24న
సన్ ఎన్ఎక్స్‌టీ:
నిరమ్ మారుమ్ ఉలగిల్ (తమిళ అంథాలజీ క్రైమ్ ఎమోషనల్ డ్రామా)- ఏప్రిల్ 25
జీ5:
అయ్యన్న మానే (కన్నడ హారర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25
యాపిల్ ప్లస్ టీవీ:
వోండ్లా (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
కల్లం (మలయాళం డ్రామా చిత్రం)- ఏప్రిల్ 25
కుమ్మట్టికలి (మలయాళం క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 25
ఇందులో ఏప్రిల్ 25న ఒకరోజు పదికిపైగా సినిమాలున్నాయి. ఇందులో మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూరన్ పార్ట్ 2, ఎంపురన్ సినిమాలు థ్రిల్ ఇవ్వనున్నాయి. వీటితో పాటుగా హిందీ మూవీ జువెల్ థీఫ్, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్, తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ హావోక్, యాత్తి సాయి ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వీకెండ్లో ఓ లుక్కేయండి.