సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లో హవా చూపిస్తుంటే.. అస్సలు తగ్గేదేలే అంటూ ఓటీటీ కూడా తన జోరు కొనసాగిస్తోంది. లాస్ట్ వీకెండ్ సంక్రాంతి స్పెషల్ గా 20 కి పైగా ఓటీటీ సినిమాలు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరిన్ని కొత్త సినిమాలతో ఓటీటీ అలరించనుంది.
ఇవాళ ఒక్కరోజే (జనవరి 17న) ఓటీటీలో 10కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. ఇందులో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ యాక్షన్, ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్స్ జోనర్ సినిమాలు ఉండటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. మరి ఆ సినిమాలేంటీ? ఎక్కడ స్ట్రీమింగ్ కి వచ్చాయి? అనే వివరాలు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
ది రోషన్స్ (హృతిక్ రోషన్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ హిందీ సిరీస్)- జనవరి 17
బ్యాక్ ఇన్ యాక్షన్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్)- జనవరి 17
XO, కిట్టి సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 16
ఆహా:
అన్‌స్టాపబుల్ సీజన్ 4 రామ్ చరణ్ ఎపిసోడ్-2 (తెలుగు టాక్ షో)-- జనవరి 17
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17
అమెజాన్ ప్రైమ్:
పాతాల్ లోక్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 17
ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జనవరి 17
అమెజాన్ MX ప్లేయర్:
చిడియా ఉద్ద్ (క్రైమ్ డ్రామా సిరీస్)- జనవరి 15
జీ5:
విడుదల పార్ట్ 2 (తమిళ యాక్షన్ డ్రామా మూవీ)- జనవరి 17
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
పవర్ ఆఫ్ పాంచ్ (హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్)- జనవరి 17
ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 17
జియో సినిమా ఓటీటీ:
హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్)- జనవరి 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ:
హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) (హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17
మనోరమ మ్యాక్స్ ఓటీటీ:
ఐయామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- జనవరి 17
ఇందులో స్పెషల్ మూవీస్ గురించి చెప్పుకోవాలంటే.. విజయ్ సేతుపతి నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్ 2, గృహ లక్ష్మీ, ఫాంటసీ థ్రిల్లర్ పవర్ ఆఫ్ పాంచ్, డాక్యుమెంటరీ సిరీస్ ది రోషన్స్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అలాగే హాలీవుడ్ హారర్ మూవీ స్పీక్ నో ఈవిల్, హారర్ యాక్షన్ థ్రిల్లర్ హెల్‌బాయ్ 4, మలయాళ కామెడీ సినిమా ఐయామ్ కథలన్ కూడా స్పెషల్ గా ఉన్నాయి.