పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు  టెక్నాలజీతోపాటు, ఆయుధ వినియోగంపై పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. 

ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, రవీంద్రకుమార్, రఘుచందర్, సీఐ లు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.