పశు వైద్యశాల ఎదుట గొర్రెల కాపర్ల ధర్నా 

గన్నేరువరం, వెలుగు:  పశువైద్యశాలలో గొర్రెలు, మేకలకు వచ్చే సీజనల్​ వ్యాధులకు మందులు అందుబాటులో ఉండడం లేదని, ఇన్‌‌‌‌చార్జి డాక్టర్‌‌‌‌‌‌‌‌ టైంకు రావడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం యాదవులు, గొర్రెల కాపర్లు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పశు వైద్యశాల ఉన్నప్పటికీ జూన్‌‌‌‌లో మందులు పంపిణీ  చేయాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. పర్మినెంట్​ డాక్టర్​ అందుబాటులో లేక జీవాలు రోగాల బారిన పడి చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు ప్రశాంత్ యాదవ్, ఎల్లయ్య, బాలయ్య, రాములు, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.