చేతబడి అనుమానంతో స్నేహితుడిని కొట్టి చంపిన్రు

చేతబడి అనుమానంతో స్నేహితుడిని కొట్టి చంపిన్రు
  • చందానగర్​ పీఎస్ ​పరిధిలోని 
  • గోపి చెరువు వద్ద ఘటన 

చందానగర్, వెలుగు: చేతబడి చేయిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని కర్రలతో కొట్టి చంపారు. చందానగర్​పీఎస్​పరిధిలోని నెహ్రూనగర్ లో ఉండే నసీరుద్దీన్ చేతబడి చేయిస్తున్నాడని, అదే కాలనీలో ఉండే అతని స్నేహితుడు ఫక్రుద్దీన్ అనుమానం పెంచుకున్నాడు. 

శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మాట్లాడుకుందా రా.. అని నసీరుద్దీన్​ను గోపి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. చేతబడి విషయమై మాట్లాడుతూ ఫక్రుద్దీన్, మరో ముగ్గురితో కలిసి కర్రలతో నసీరుద్దీన్​పై దాడిచేశారు. 

తీవ్రంగా గాయపడిన నసీరుద్దీన్ స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం కొండాపూర్​జిల్లా హాస్పిటల్​కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు  తెలిపారు. సీఐ పాలవెల్లి ఫక్రుద్దీన్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు ఫైల్​ అయింది.