శ్మశానంలో ఫ్రెండ్ బర్త్ డే

‘స్నేహానికన్న మిన్న లోకానలేదురా’ అనే ఈ పాట వినే ఉంటారు. ఈ పల్లవిలో చెప్పినట్లుగా ఎవరికైనా స్నేహితులను మించిన వారుండరు. ఏ కష్టమొచ్చినా, బాధ వచ్చినా స్నేహితులతో పంచుకుంటారు. అందుకే చాలామంది చుట్టాల కన్నా స్నేహితులే బెటర్ అంటుంటారు. అలా కొంతమంది మిత్రులు చనిపోయిన తమ స్నేహితుడిని మరచిపోలేక.. అతని సమాధి వద్ద బర్త్ డే వేడుకలను నిర్వహించారు.

వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన బాలాజీ డిసెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే ఈ రోజు బాలాజీ పుట్టినరోజు కావడంతో అతని సమాధి దగ్గర స్నేహితులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బాలాజీతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.

For More News..

ఢిల్లీలో ఆఫీసులు బంద్.. బార్లు రెస్టారెంట్లు క్లోజ్

జలుబు చేస్తే.. కరోనాయేనా?