టెక్నాలజీ : ఫేస్​బుక్​లో ‘ఫ్రెండ్స్’ ట్యాబ్​

టెక్నాలజీ : ఫేస్​బుక్​లో ‘ఫ్రెండ్స్’ ట్యాబ్​

ఫేస్​బుక్ కొత్త ఫీచర్​ను తీసుకురాబోతోంది. ఇది ఫేస్​బుక్​ యూజర్ల ఫ్రెండ్​షిప్​ను మరింత బలపరచడంలో సాయపడనుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే.. ‘ఫ్రెండ్స్’. ఫేస్​బుక్​లో ఫ్రెండ్స్​ అనే కొత్త ట్యాబ్​ రాబోతుంది. ఫేస్​బుక్ యూజర్లు సాధారణంగా యూజర్లు వాళ్ల ఫాలోవర్స్, వాళ్ల ఇంట్రెస్ట్​లను బట్టి ఫేస్​బుక్​ అకౌంట్​ ఫీడ్​లోని కంటెంట్ చూసేవాళ్లు.  అయితే ఈ ‘ఫ్రెండ్స్​’ అనే ట్యాబ్​పై క్లిక్ చేయడం ద్వారా ఫేస్​బుక్​ టైమ్​లైన్​లో తమ ఫ్రెండ్స్ డీటెయిల్స్ మాత్రమే చూడగలిగే వీలుంది. 

ఈ ట్యాబ్​లో యూజర్లు తమ ఫ్రెండ్స్ స్టోరీలు, రీల్స్, పోస్ట్​​లు, డేట్ ఆఫ్​ బర్త్ వంటి వివరాలు చూడగలరు. వీటితోపాటు వాళ్ల ఫ్రెండ్స్​కు సంబంధించిన కంటెంట్​ కూడా చూడగలరు. ఈ ఫీచర్ ఇన్​స్టాగ్రామ్​లో ఉన్న ‘ఫాలోయింగ్’, ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఫీచర్లలానే ఉంటుంది. అంటే మీరు ఫాలో అయ్యే వాళ్లు, ఫ్రెండ్స్ లిస్ట్​లో ఉన్న పేజీల పోస్ట్​లు, రీల్స్, స్టోరీస్ మాత్రమే యాప్​లో కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, కెనడాలలో అందుబాటులో ఉంది. మనదేశానికి కూడా త్వరలోనే రానుంది. ఈ ట్యాబ్​ హోమ్​ ఫీడ్​ నావిగేషన్​ బార్​లో కనిపిస్తుంది. ఈ ఫీచర్​ని యాప్​లోని బుక్​మార్క్ సెక్షన్​ నుంచి ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. 

స్టేటస్​కి బ్యాక్​గ్రౌండ్ సాంగ్

వాట్సాప్​లో మరో కొత్త అప్​డేట్ వచ్చేసింది. ఇక నుంచి వాట్సాప్​లో స్టేటస్​ పెట్టేటప్పుడు దానికి తగ్గట్టు మీకు నచ్చిన పాటను ట్యాగ్ చేయొచ్చట! మెటా ప్రకారం.. వాట్సాప్​ యూజర్లు మిలియన్ల పాటలకు యాక్సెస్ పొందుతారు. స్టేటస్ అప్​డేట్ చేసే సమయంలో వీడియో, ఫొటో, టెక్స్ట్​ వంటి ఆప్షన్లతో పాటు మ్యూజిక్​ జతచేసే ఐకాన్​ కూడా అందుబాటులో ఉంది. స్టేటస్​కు పాటను ఎలా జోడించాలంటే.. ముందుగా వాట్సప్​లో స్టేటస్​ సెక్షన్​కి వెళ్లాలి. 

అక్కడ యాడ్ స్టేటస్​ ఐకాన్​పై ట్యాప్​ చేసి గ్యాలరీ నుంచి ఫొటో లేదా వీడియోను సెలక్ట్ చేయాలి. తర్వాత స్క్రీన్​ పై కనిపించే మ్యూజిక్​ ఐకాన్​ను ట్యాప్​ చేయాలి. అక్కడ ఉన్న పాటల లిస్ట్​లో మీకు నచ్చిన పాట సెర్చ్ చేసి, ఎంపిక చేయాలి. తర్వాత డన్​ మీద క్లిక్ చేయాలి. దాంతో స్టేటస్​ చూసేవాళ్లకు మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. యూజర్లు ఇమేజ్ స్టేటస్ కోసం15 సెకండ్లు, వీడియో స్టేటస్ కోసం అయితే 60 సెకండ్ల పాటు మ్యూజిక్​ పెట్టొచ్చు. ఇందులో ఇంట్రెస్టింగ్​ విషయం ఏంటంటే.. పాటలో ఏ లైన్లు పెడితే బాగుంటుందనిపిస్తోందో అంతవరకే సెలక్ట్ చేసి పెట్టొచ్చు. అంతేకాదు.. ఈ లిస్ట్​లో ట్రెండింగ్​ సాంగ్స్ కూడా ఉంటాయి.