చాట్ జీపీటీ ఇద్దరు యువకులను కోటీశ్వరులను చేసింది. కేవలం రూ. 15 వేల పెట్టుబడితో వారు కోటి రూపాయలను సంపాదించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీని ఉపయోగించి డైమ్ ఏడజన్ అనే ఏఐ టూల్ను తయారు చేశారు ఇద్దరు యువకులు. ఈ టూల్ను అమ్మగా కోటిరూపాయలు వచ్చాయి.
అమెరికాలో సాల్ ఐయెల్లో, మోనికా పవర్ అనే ఇద్దరు స్నేహితులు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీ ద్వారా చాట్ బాట్ ను ఉపయోగించి డైమ్ ఏడజన్ అనే ఏఐ టూల్ను తయారు చేశారు. డైమ్ ఏడజన్లో యూజర్లు తమ వ్యాపార ఆలోచనలను ఓ ఫారం రూపంలో సమర్పిస్తే ..అది పూర్తి నివేదిక రూపంలో మనకు అందిస్తుంది. వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి. ఎలా మొదలు పెట్టాలి. ఇన్వెస్టర్లు ఎవరు..ఏ సంస్థల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది..కస్టమర్లు ఎవరు..వంటి వివరాలను ఓ నివేదిక రూపంలో ఈ డైమ్ ఏడజన్ టూల్ తెలియజేస్తుంది.
సాల్ ఐయెల్లో, మోనికా పవర్ లు రూ. 15 వేలతో తయారు చేసిన డైమ్ ఏడజన్ టూల్ను ఫెలిపే అరోసెమెనా, డేనియల్ డి కార్నెయిల్ అనే భార్యభర్తలు రూ. కోటికి పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం డైమ్ ఏడజన్ టూల్ కొత్త యజమానులు ఫెలిపే అరోసెమెనా, డేనియల్ డి కార్నెయిల్గా ఉన్నా కూడా.. సాల్ ఐయెల్లో, మోనిక పవర్ లు డైమ్ ఏడజన్కు సలహాదారులుగా ఉన్నారు.