ఫ్రెండ్ షిప్ డే స్పెషల్... దోస్తానా మంచిగుండాలంటే గిట్ల చెయ్యండి

ఫ్రెండ్ షిప్ డే స్పెషల్... దోస్తానా మంచిగుండాలంటే గిట్ల చెయ్యండి

ప్రస్తుతం  ప్రపంచంలో ప్రతీ ఒక్కరు అనేక ప్రతికూలతలు, కష్టాలతో  తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితానికి  సంతోషం కలిగించే  అత్యంత ముఖ్యమైన వ్యక్తులు కొందరు ఉంటారు. వారెవరో కాదు..మన స్నేహితులే. ఎన్ని కష్టాలు..ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా..స్నేహితులతో చెప్పుకుంటే..స్నేహితులతో కొద్ది క్షణాలు గడిపితే చాలు..మన కష్టం మరిచిపోతాం. ఈ స్నేహితుల దినోత్సవాన్ని  మీ స్నేహితులతో మరింత గొప్పగా జరుపుకోవడానికి..వారితో మీ స్నేహ బంధం మరింత బలపడటానికి ఏం చేయాలో చూద్దాం..

ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే 2024 సందర్భంగా  మీ బెస్ట్ ఫ్రెండ్‌ మిమల్ని మరింత ఇష్టపడేలా ..మిమల్ని మరింత ప్రేమించబడేలా చేయడానికి ఈ ఐదు చిట్కాలను పాటించండి..

దోస్తులతో ఎక్కువ సేపు మాట్లాడండి..

మీ బెస్ట్ ఫ్రెండ్ కు మీకు మధ్య సంబంధం మరింత బలపడాలంటే..ముఖ్యమైన చిట్కా..వారితో ఎక్కువ సేపు మాట్లాడండి.  మీ జీవితం..మంచి విషయాలు, చెడు విషయాలను కూడా వారితో ఇష్టంగా పంచుకోండి. ప్రతీ రోజూ ఏం చేస్తున్నారు..ఏం తిన్నారు.  భవిష్యత్ కోసం ఏం ఆలోచిస్తున్నారు. వాటన్నింటిని పంచుకోండి. ఈ సంభాషణ ఇద్దరికి మానసిక ఆనందాన్ని ఇస్తుంది. దీంతో పాటు..మీకు మీ స్నేహితుడంటే ఎంత ప్రేమో అతడికి తెలియజేస్తుంది. 

విహారయాత్రలకు వెళ్లండి..

మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో స్నేహ బంధం మరింత బలపడాలి అంటే..వారితో విహార యాత్రలకు వెళ్లండి. సినిమాలు లేదా టూర్లు ప్లాన్ చేయండి. మీ స్నేహితులకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించండి. ఈ చిట్కా..మీ స్నేహితులకు..మీకు మధ్య గొప్ప జ్ణాపకాలను అందిస్తుంది. జీవితంలో  మధుర స్మృతులను మదిలో నిల్వ చేస్తుంది. 

గిఫ్ట్ ఇవ్వండి..

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రోజున మీ బెస్ట్ ఫ్రెండ్‌కు ప్రత్యేకంగా ఏదైనా పంపండి. చిన్న బహుమతి లేదా పెద్ద బహుమతి అయినా....మీరు మీ స్నేహితుడి పట్ల ఎంత మంచి ఆలోచనను, భావాన్ని కలిగి ఉన్నారో బహుమతి తెలియజేస్తుంది. ఇచ్చే  బహుమతులు మీరు మీ బెస్టీని మెచ్చుకున్నట్లు, ఇష్టపడ్డట్లు ఉంటే మంచిది. 

లేఖ రాయండి..

కొన్నిసార్లు మీ స్నేహితులు అంటే మీకు ఎంత ఇష్టమో..గౌరవమో చెప్పడం మాటల్లో సాధ్యపడదు. అలాంటి వాటిని లెటర్ల ద్వారా తెలియపరిస్తే మంచిది.  మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మీరు ఇష్టపడే అన్ని విషయాలను  లేఖలో రాసి వారికి పంపండి. అది వారికి సర్ ప్రైజ్ ను అందిస్తుంది. మీ ప్రేమను మరింత గొప్పగా వ్యక్త పరుస్తుంది. 

సరదాగా కలుస్తూ..మీ బంధాన్ని మరింత బలపర్చుకోండి..

పార్క్‌లో కలిసి సమయం వెచ్చించేలా..లేదా  ఇంట్లో  గేమ్‌లు ఆడి  ఆనందించేలా ఈ స్నేహితుల దినోత్సవం రోజున ప్లాన్ చేయండి. అంతర్జాతీయ స్నేహ దినోత్సవం రోజున కలిసి సరదాగా సమయం గడపండి. ఈ చిట్కాలు పాటిస్తే..స్నేహితుల మధ్య ఉన్న  బంధం మరింత బలపడుతుంది.