- ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఘటన
- రెండు కుటుంబాల్లో విషాదం
పాల్వంచ, వెలుగు: కలిసి చదువుకుంటున్న ఇద్దరు ఫ్రైండ్స్ మరణంలోనూ తోడుగా వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఏనుగు మధుకర్ రెడ్డి( 20), దూడల శివ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా నవభారత్ సమీపంలో బైక్అదుపుతప్పి డివైడర్ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మధుకర్ రెడ్డి బీకాం చివరి సంవత్సరం చదువుతుండగా, శివ బీజడ్సీ చదువుతున్నాడు. నవభారత్ గాంధీనగర్‌కు చెందిన మధుకర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.మృతుడికి తల్లి రమాదేవి, అక్క ఉన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేటకు చెందిన శివ పాల్వంచలోని బీసీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద విషయం తెలిసిన పట్టణ ఎస్ఐ బాణాల రాము ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌బాడీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.