
ఏటూరునాగారం, వెలుగు: తునికాకు బోనస్ డబ్బులు కింది స్థాయి ఉద్యోగుల ఖాతాలకు మళ్లించి సొంతానికి వాడుకున్న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంపసర ఎఫ్ఆర్వో బాలరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు.
ఏటూరునాగారం నార్త్ రేంజ్ అధికారిగా పని చేసిన బాలరాజు తునికాకు కూలీలకు ఇవ్వాల్సిన రూ.2.70 లక్షల బోనస్ డబ్బులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేయించి, తన సొంతానికి వాడుకున్నట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ తెలిపారు.