
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: అడవులతోనే మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎఫ్ఆర్ వో గులాబ్‌సింగ్ అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ తీశారు. పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోతోర్య తండాలో అవగాహన..
పెంబి, వెలుగు: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని ఇటిక్యాల్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతాప్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురష్కరించుకొని లోతోర్య తండాలో ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల పెంపకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆదర్శ రైతులు గుగ్లావత్ రెడ్డి, బానావత్ గణేశ్‌లను సత్కరించారు. సిర్పూర్ పేపర్ మిల్లు ప్లాంటేషన్ అధికారి శ్రీధర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సుందర్, సుధాకర్, బీట్ ఆఫీసర్లు స్రవంతి, కిరణ్, గంగారాం, ఆశిష్, శ్రీనివాస్, ఏఈవో రాజ్ కుమార్ పాల్గొన్నారు.