పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎఫ్ఆర్వో వినయ్ నాయక్​

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎఫ్ఆర్వో వినయ్ నాయక్​

సిరికొండ,వెలుగు : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎఫ్ఆర్వో వినయ్ నాయక్​ పేర్కొన్నారు. సత్యశోధక్ ​గ్రీన్ ​కోర్​ యూనిట్​ఆధ్వర్యంలో శనివారం సిరికొండలో పర్యావరణం పచ్చదనం, అడవుల సంరక్షణపై స్టూడెంట్స్​కు అవగాహన కల్పించారు.

విద్యార్థులు తమ బర్త్​డే రోజు మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం మొక్కల పెంపకం ఆవశ్యకతపై యన్​జీసీ గోడప్రతులను ఆవిష్కరించారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన స్టూడెంట్స్​కు జ్ఞాపికలు అందజేశారు. డీఆర్​వో గంగారం, ప్రిన్సిపల్ ​రావుట్ల నర్సయ్య, ఫారెస్ట్​ సిబ్బంది పాల్గొన్నారు.