
డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్హస్టల్లో వాటర్ స్టోరేజీ స్టీల్ట్యాంకులో తాగునీటిలో ఆదివారం కప్ప కనిపించింది. యూనివర్సిటీ అధికారులు అడుగడుగునా వ్యవహరిస్తున్నారని స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని అనేకమార్లు ఫిర్యాదులు, నిరసనలు చేసినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.