వీడియో: అయ్యో వెజ్‌ను నాన్‌వెజ్ చేశారే..!: సమోసాలో 'కప్ప కాలు'

వీడియో: అయ్యో వెజ్‌ను నాన్‌వెజ్ చేశారే..!: సమోసాలో 'కప్ప కాలు'

బిర్యానీ తిందామంటే బొద్దింకలు.. సాంబార్ తిందామంటే చచ్చిన ఎలుకలు.. జ్యూస్ తాగుదామంటే బల్లులు.. ఐస్‍క్రీమ్ తిందామంటే మనిషి వేళ్లు.. చాక్లెట్ తిందామంటే పురుగులు.. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇవి పొరపాటున పడుతున్నాయో.. లేదంటే రుచి కోసం వారే వేస్తున్నారో వడ్డిస్తున్న వారికే తెలియాలి. 

తాజాగా, కడుపారా ఇష్టమైన సమోసా తిందామనుకున్న ఓ యువకుడికి 'కప్ప కాలు' దర్శనమిచ్చింది. అది కూడా సగం తిన్నాక కనపడటంతో అతని బాధ మాటల్లో చెప్పలేనిది. తిన్న సమోసాలో సగం కాలే కనపడటంతో.. దుకాణం యజమానితో గొడవ తరువాత బయటకెళ్లి ఇంకో సగం కోసం అరగంట పాటు వాంతులు చేసుకున్నాడట. అయినప్పటికీ అది కనిపించలేదట. బహుశా.. మెత్తగా నమిలేసి మింగేశాడేమో..! ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న బికనీర్‌ స్వీట్స్‌ షాప్‌లో సమోసా కొనుగులో చేశాడు. అసలే ఆకలి మీద ఉండటంతో ఆత్రుతగా దానిని  తినడం మొదలు పెట్టాడు. ఇంతలో అతనికి నాన్ వెజ్ ముక్క కప్ప కాలు దర్శనమిచ్చింది. కనిపించిన ఆ కప్ప కాలు కూడా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఇంకేముంది.. ఆవురావురమంటూ స్వీట్ షాప్ యజమాని వద్దకు పరుగులు చేశాడు. తన సమోసాలో వచ్చిన కప్పకాలు ఘటనపై అతన్ని ప్రశ్నించాడు. వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అనంతరం పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సన్నివేశాలను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మీరూ బయట ఫుడ్ తినే అలవాటు ఉంటే వీలైనంత త్వరగా మానుకోండి. లేదంటే నేరుగా నాన్ వెజ్ ఆర్డర్ చేసుకొని తినేయండి. ఒకవేళ చచ్చిన బొద్దింకలు, ఎలుకలు వచ్చినా ముక్కల్లో కలిసిపోతాయి.