ప్రయాగ్ రాజ్: కుంభమేళా ప్రధానంగా నాలుగు చోట్ల జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ్ రాజ్, ఉజ్జయిన్, నాసిక్ లో జరిగే ఈ కుంభమేళాకు ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. పుణ్యస్నానాలు ఆచరించి వెనుదిరుగుతారు. ప్రయాగ్ రాజ్ లో వచ్చే కుంభమేళాకు మౌని అమావాస్య కలిసి వస్తుండటం.. ఆ రోజు అమృత స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం ఉండటంతో ప్రయాగ్ రాజ్ కు భారీగా తరలివెళ్తుంటారు. ఓ సారి చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఐదు కుంభమేళాల్లో తొక్కిసలాట జరగగా.. నాలుగు ప్రయాగ్ రాజ్ లోవే కావడం గమనార్హం.
1954లో 800 మంది మృతి
స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోగా రెండు వేల మంది గాయపడ్డారు. అది కూడా మౌని అమావాస్య నాడే చోటుచేసుకొంది.
Also Read :- డీప్ సీక్ అంటే అమెరికాకు భయమా..ఎందుకు?
1986లో 200 మంది మృతి
1986 ఏప్రిల్ 14న కుంభమేళా సందర్భంగా నాటి యూపీ సీఎం వీర్‌బహదూర్ సింగ్ తనతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను తీసుకొని హరిద్వార్‌లో స్నానాలకు వచ్చారు. ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకొని 200 మంది మరణించారు.
2003 నాసిక్లో 39 మంది మృతి
2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. నాడు జరిగిన తొక్కి సలాటలో 39 మంది మరణించారు.
2013లో త్రివేణి సంగమం వద్ద 42 మంది మృతి
2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10వ తేదీన తొక్కిసలాట చోటుచేసుకొంది. ఒక ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడమే దీనికి కారణం. ఈ ఘటనలో 42 మంది మరణించారు.