ఏడాదికి రెండుసార్లు CBSE పదో తరగతి ఎగ్జామ్స్

ఏడాదికి రెండుసార్లు CBSE  పదో తరగతి ఎగ్జామ్స్

CBSE ఎగ్జామ్స్ లో కీలక మార్పులు చేశారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం 2026 నుంచి CBSE పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి లేకుండా ఎక్కువ స్కోర్ చేసేందుకు ఈ విధానం ప్రోత్సహిస్తోంది. దీంతోపాటు అదనంగా 2026-2027 విద్యా సంవత్సరంలో 260 విదేశీ స్కూళ్ళకు గ్లోబల్ సెలబస్ ను ప్రవేశపెట్టనున్నారు. 

సోమవారం (ఫిబ్రవరి19) ఉదయం ఉద్దేశించిన ముసాయిదా  పథకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, జాతీయ విద్యా పరిశోధన సంగథన్, నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులతో  చర్చలు నిర్వహించారు. సెంటర్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిం చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

ఈ విధానంతో విద్యార్థులు రెండుసార్లు ఎగ్జామ్స్ రాయడం ద్వారా అధిక మార్కులు పొందవచ్చు.కేవలం పరీక్ష ద్వారా మార్కుల సాధించడమే కాదు నైపుణ్యం , సెల్ఫ్ డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టడం ద్వారా జాతీయ విద్యావిధానం లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు. అదనంగా 2026-27 విద్యాసంవత్సరంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నట్లు, భారత దేశ ముఖ్యమైన అంశాలను ఈ సెలబస్ లో చేర్చడం వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.