వర్షాకాలం ముగింపు, శీతాకాలం ప్రారంభానికి మధ్యలో వచ్చే అక్టోబర్ లో వేడి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ వేడిని ఎదుర్కొనేందుకు, ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.
- మజ్జిగ లేదా పెరుగు జీర్ణ వ్యవస్థకు సహాయపడే పానీయం. ఇది శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది, శరీరం చల్లబడేలా చేస్తుంది. సాధారణంగా పెరుగును నీటితో కరిగించి జీలకర్ర, ఉప్పు, పుదీనా వంటి వాటిని చేర్చడం ద్వారా దీన్ని తయారుచేస్తారు.
- విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లను తీసుకోవాలి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంతో, ఆర్ధ్రీకరణను అందించడంలో సహాయపడతాయి. వీటిని పండ్లుగా లేదంటే జ్యూస్ గానూ తీసుకోవచ్చు.
- దోసకాయ అనేది అక్టోబర్ లో ఉండే వేడికి సరైన శీతలీకరణిగా పని చేస్తుంది. దీన్ని హైడ్రేటింగ్ వెజిటేబుల్ అని కూడా పిలుస్తారు. దీన్ని సలాడ్, రైతా, జ్యూస్ గానూ ఆస్వాదించవచ్చు.
- పాలకూర, మెంతి, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఇతర ఖనిజాలు విరివిగా ఉంటాయి. ఇవి పోషకాలను సైతం అందిస్తాయి. వీటిని కూరలు, సలాడ్ లలో ఉపయోగించవచ్చు.
- కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. ఇది అత్యధిక చక్కెర కలిగి ఉండే స్పోర్ట్స్ డ్రింక్స్ కు ప్రత్మామ్నాయం.
- చెరకు రసం అక్టోబర్ లో ఉండే వేడిని ఎదుర్కొనేందుకు మంచి పరిష్కారం. ఇది శీతలీకరణ లక్షణాలతో పాటు విటమిన్ సి, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది, రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది.
- పుదీనా, కొత్తి మీర వంటి మూలికలు ప్రతి ఇంటి వంటగదిలో అత్యంత ప్రధానమైనవి. ఇవి వేడి సమయంలో రిఫ్రెష్ గా ఉండడానికి రోజూ వారి వంటకాల్లో, సలాడ్ లు, నీటిలో చేర్చి తీసుకోవచ్చు.