- కరోనా భయం నుంచి కోలుకున్న జనం..
- ఎంటర్ టైన్ మెంట్, టూరిస్ట్ ప్లేప్లేసెస్‌లో రష్
- ఆడియన్స్, విజిటర్స్‌తో సందడిగా మారినయ్
ప్రశాంత్ ఐటీ ఎంప్లాయ్. కరోనా.. లాక్డౌన్.. అన్‌లాక్‌లతో కొద్ది నెలల పాటు ఇంటికే పరిమితమై ఉండిపోయాడు. ప్రస్తుతం అన్ని నార్మల్‌గా మారాయి. దీంతో చాలాకాలం తర్వాత అతను ఫ్యామిలీతో కలిసి టూరిస్ట్ ప్లేసెస్‌ను సందర్శించి వీకెండ్ఎంజాయ్చేశారు.’’
రమేష్ ఇంజినీరింగ్ స్టూడెంట్. సిటీలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. కరోనా.. లాక్‌డౌన్‌తో సొంతూరు వెళ్లి పోయాడు. ప్రస్తుతం కాలేజీలు ఓపెన్‌కావడంతో మళ్లీ వచ్చాడు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి మూవీకి వెళ్లాడు.’’
హైదరాబాద్, వెలుగు: సిటీలో అన్ని నార్మల్ కావడంతో మళ్లీ టూరిస్ట్, ఎంటర్ టైన్ మెంట్ ఫుల్ మస్తీ మొదలైంది. కరోనా.. లాక్ డౌన్ లో క్లోజ్ అయినవి ప్రస్తుతం వంద శాతం ఓపెన్ కావడంతో రద్దీగా మారాయి. ఇన్నాళ్లు వెలవెలబోయిన ప్లేసెస్ ల్లో జోష్‌తో కనిపిస్తున్నాయి. కల్చరల్సెంటర్లు, పార్క్ లు, పబ్ లు, రీ క్రియేషన్ క్లబ్ లు, ఈవెంట్స్ సెంటర్లు, సినిమా థియేటర్లు, టూరిస్ట్ ప్లేసెస్ వందశాతం స్టార్ట్ కావడంతో వీడెండ్స్లో సిటిజన్స్నచ్చిన ప్లేసెస్‌కు వెళ్లి ఎంజాయ్‌చేస్తున్నారు.
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్లి..
కరోనా ఎఫెక్ట్ తో కొన్ని నెలల పాటు లాక్డౌన్ కారణంగా అన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అంతా నార్మల్‌గా మారడంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్లి సరదాగా గడిపేస్తున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, హుసేన్సాగర్ లో బోటింగ్, పాతబస్తీలోని చార్మినార్ వద్దకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. దుర్గం చెరువు, తీగల వంతెన పై కూడా సందర్శకుల తాకిడి పెరిగింది. సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్, బేగం బజార్, నెహ్రూ జులాజికల్ పార్క్, గోల్కొండ కోట ఇలా అన్ని టూరిస్ట్ ప్రదేశాలకు జనం వెళ్తున్నారు. సెలవు రోజులతోపాటు వీకెండ్ లలో అన్ని ప్రదేశాలు చాలా రద్దీ గానే ఉంటున్నాయి. వ్యాపారాలు కూడా కళకళలాడుతున్నాయి.
ఆర్టిస్టుల యాక్టివిటీస్ స్టార్ట్
జంట నగరాల్లోని అన్ని ప్రదేశాలకు జనాలు పెరగడంతో ఆర్టిస్టులు మళ్లీ తమ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. నాటకాలు, ప్రోగ్రామ్స్, స్కిట్స్, స్టోరీ టెల్లింగ్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ పై దృష్టి పెట్టారు. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ సహా ఐడియాస్ షేరింగ్స్, డిస్కషన్స్, డిబేట్స్ వంటివి ఎక్కువగా జరిగే లమాఖాన్, సమాహార, రంగభూమి, ప్రోగ్రెసివ్ థియేటర్స్ గ్రూప్, భూమిక, సురభి, నిశుంభిత, కోషిష్ వంటి కల్చరల్ వెన్యూస్ లో రష్పెరిగింది. యంగ్ ఆర్టిస్టులు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్స్ కొత్త యాక్టివిటీస్ పై చర్చలు స్టార్ట్ చేశారు.
వంద శాతం ఓపెన్ కావడంతో..
ఎంటర్ టైన్ మెంట్, టూరిస్ట్ ప్లేసెస్, సినిమా థియేటర్లు ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు. మళ్లీ మునుపటి లా అన్ని ఓపెన్అయ్యాయి. లాక్ డౌన్ ,అన్‌లాక్ కారణంగా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రాలేదు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ చాలా ప్రెజర్ గా ఫీలయ్యారు. మళ్లీ కావాల్సిన ఫన్ దొరుకుతుండడంతో ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్అవుతున్నారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్టులు ఇలా అంతటా నార్మల్ సిట్యువేషన్స్కనిపిస్తున్నాయి.
హ్యాపీగా ఉంది
వీకెండ్ లో బయటకు వెళ్లి చిల్ అవుతుం టాం. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లలేక చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాం. ఇప్పుడిప్పుడే ఔటింగ్ కి వస్తున్నాం. మూవీ చూసి శిల్పారామంలో షాపింగ్ కి వచ్చాం. చాలా రోజుల తర్వాత ఎప్పటి లాగా బయట తిరగడం హ్యాపీగా ఉంది. – భవ్య, స్టూడెంట్, కూకట్ పల్లి
రెస్పాన్స్ బాగుంది
సిటీలో థియేటర్ వర్క్ షాప్ కి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ ల వారు కలుస్తుంటారు. కొన్ని రోజులుగా ఫుల్ యాక్టివిటీస్‌తో థియేటర్ వర్క్ షాప్, షోలు షురూ చేశాం. నేర్చుకునే వారి నుంచి రెస్పాన్స్ బాగుంది. షో లు చూసేందుకు జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. – షేక్ బషీర్ (థియేటర్ ఆర్టిస్ట్, ప్రోగ్రెస్సివ్ థియేటర్ గ్రూప్)
ఇవి కూడా చదవండి..
ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం