ఇవాళ్టి (21 జనవరి) నుంచే గ్రామసభలు

ఇవాళ్టి (21 జనవరి) నుంచే గ్రామసభలు
  • సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించాలి
  • అభ్యంతరాలుంటే అర్జీలు స్వీకరించాలి
  • వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్​జైన్

వికారాబాద్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి డ ఈ నెల 24 వరకు గ్రామ సభలను షెడ్యుల్ ప్రకారం నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. అలసత్వం వహిస్తే  చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో ఆయన మాట్లాడారు. 

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలన్నారు. అభ్యంతరాలుంటే నాలుగు పథకాలకు నాలుగు రిజిస్టర్లను ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించాలన్నారు. 

లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియని ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీఎస్ఓ మోహన్ బాబు, పీడీ హోసింగ్ కృష్ణ, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, డీటీడీఓ కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.