గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి.. ఇప్పటివరకు దేశంలో 13,36,861 కేసులు నమోదైనట్లు ఆ శాఖ తెలిపింది. వీటిలో 4,56,071 కేసులు ప్రస్తుతానికి యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి 8,49,431 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల గత 24 గంటల్లో 757 మంది చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 31,358 మంది చనిపోయారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. శుక్రవారం 4,20,898 శాంపిళ్లు టెస్ట్ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 1,58,49,068 శాంపిళ్లు టెస్ట్ చేశారు.
కరోనా కేసులలో అమెరికా 42,48,327 కేసులతో మొదటిస్థానంలో ఉండగా.. 23,48,200 కేసులతో బ్రెజిల్ రెండోస్థానంలో ఉన్నాయి. వీటి తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది.
For More News..