సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకుడు. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతూ జనవరి 1న సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా.. నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసెనా’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌లో ఆకాష్, భావన కొత్తగా పెళ్లయిన జంటగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
శాండిల్య పీసపాటి కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందమైన లిరిక్స్ రాయగా, కీర్తన, శాండిల్య కలిసి పాడారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఆకట్టుకునే సోషల్ డ్రామాగా తెరకెక్కించామని, రాఘవేంద్ర రావు శైలికి భిన్నంగా ఉంటూనే ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.