రాజేశ్వరరావుపేట పంప్ హౌజ్ నుంచి వరద కాల్వలోకి నీళ్లు

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా  మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట పంప్ హౌజ్ నుంచి ఎస్సారెస్పీ వైపు నాలుగు  మోటార్ల ద్వారా ఎత్తిపోతలు షురువయ్యాయి. గురువారం పొద్దున ఇరిగేషన్​ ఆఫీసర్లు  పంపుహౌజ్​ వద్ద ఒక్కొక్కటిగా నాలుగు మోటార్లు  ఆన్ చేసి వరద కాల్వలోకి  నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించారు. 

వరద కాల్వ ద్వారా ముప్కాల్ పంప్ హౌజ్ కు ఈ నీళ్లు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా ఎస్సారెస్పీలోకి   తరలించనున్నారు.  రాజేశ్వరరావు పేట పంప్ హౌజ్ నుంచి 0.2 టీఎంసీల నీటిని వరద కాల్వ ద్వారా ఎత్తిపోశామని పంప్ హౌజ్ ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు.