NDAకి హెల్ప్ చేస్తే: చంద్రబాబు, నితీష్ కుమార్ డిమాండ్లు ఇవే!

లోక్ సభ ఎన్నికల్లో సరైన మెజార్టీ బీజేపీకి రాలే.. దీంతో కూటమి పార్టీలైన టీడీపీ, జేడీయూ మద్దతు చాలా కీలకం.. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తే మాకేంటి అని ప్రాంతీయ పార్టీలు తమ డిమాండ్లను ముందుంచే అవకాశాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ఎన్డీయే ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రానికి బీజేపీ ఎంపీలంతా ఢిల్లీకి రానున్నారు. ఈ రాత్రికి బీజేపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ ఢిల్లీకి రానున్నారు.

అయితే గురువారం జనతాదళ్ ముఖ్య నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. ఆ పార్టీ డిమాండ్స్ గురించి ప్రస్తావించాడు. జేడీయూ పూర్తి సపోర్డ్ బీజేపీకి ఉంది.. స్పెషల్ షరతులు ఏం లేవు, కానీ అగ్నిపథ్ పథకంపై ప్రజల్లో  విపరీతమైన వ్యతిరేకత ఉంది.. ఆ స్కీంపై కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ ఒకసారి సమీక్షించాలని కోరారు. అలాగే బీహార్ కు స్పెషల్ స్టేటల్ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, అది జేడీయూ నాయకుల మనసులో ఉన్న కోరికని ఆయన చెప్పుకొచ్చాడు. అటు టీడీపీ పార్టీ వర్గాలు కూడా బీజేపీకి మద్దతు ఇస్తే వచ్చే ప్రతిఫలం గురించి చర్చిస్తున్నారు. ఐటీ, విద్యా శాఖ లాంటి నాలుగు కీలక కేంద్ర మంత్రి పదవులను టీడీపీ పార్టీ డిమాండ్ చేస్తోందని సమాచారం.. ఇరు పార్టీలు ఈ కింద డిమాండ్లను బీజేపీ ముందు ఉంచుతాయని ఆయా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

టీడీపీ డిమాండ్‌లు

ఆరోగ్యం, విద్య, ఐటీ సహా నాలుగు మంత్రిత్వ శాఖలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
లోక్‌సభ స్పీకర్ పదవి

JD-U డిమాండ్లు

బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా
అగ్నివీర్ పథకం యొక్క సమీక్ష
దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన
నాలుగు మంత్రిత్వ శాఖలు - రక్షణ, రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రవాణా