వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.శుక్రవారం (సెప్టెంబర్ 06, 2024) నుంచే బాధితుల అకౌంట్లో 10వేల నష్ట పరిహారాన్ని వేస్తున్నారు. నష్టంపై అంచనా వేసేందుకు ఇంటింటి సర్వేచేస్తూనే బాధితుల బ్యాంక్ అకౌంట్లు సేకరిస్తున్నారు.
ముఖ్యంగా వరద ప్రభావిత జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో వరద సాయం అందిస్తున్నారు. మరోవైపు మునిగిన పంటలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read :- వినాయకుడిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు
వరద సాయంపై అంచనా వేసేందుకు సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. రూ. 5వేల కోట్ల నష్టం జరిగిందని.. తక్షణ సాయం కింద రూ. 2వేల కోట్లు అందించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి కోరారు.