
నాగోబా విగ్రహానికి జలాభిషేకం చేసేందుకు గోదావరి నదికి బయలుదేరిన మేస్రం వంశీయుల పాదయాత్ర కొండ కోనల్లో కొనసాగుతోంది. దాదాపు 200 మందితో కొనసాగుతున్న పాదయాత్రలో మూడో వంతు యువకులు చెప్పులు లేకుండా, పదకొండు రోజులపాటు సంప్రదాయ పాదయాత్రలో పాల్గొనేందుకు నడుం బిగించారు.
ఈ ఆదివాసీ బిడ్డలు తమ చదువులు కొనసాగిస్తూనే మరోవైపు తమ ఆచార సాంప్రదాయాలను కాపాడుకునేందుకు పవిత్ర గంగాజల యాత్రలో పాల్గొనడం విశేషం. గురువారం జైనూర్ అటవీ ప్రాంతంలో కొనసాగిన మేస్రం వంశీయుల పాదయాత్ర ఫొటోలు ఇవి.