పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) కాంబోలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Usthad bhagathsingh).రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ షూటింగ్ స్పాట్ కి ఎంట్రీ ఇచ్చిన విధానం అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
ఇక లేటెస్ట్ గా ఉస్తాద్ సెట్ నుంచి పవన్ కళ్యాణ్ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అయినా పవన్ లుక్ విషయానికి వస్తే..పవర్ ఫుల్ పోలీస్ డ్రెస్ లో నడిచోస్తున్న ఫోటో..గబ్బర్ ఈజ్ బ్యాక్ అన్నట్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంటెన్సివ్ లుక్లో పవన్ కనిపిస్తుండగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వెంట ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఉండటం విశేషం. వీరిద్దరీ ఫ్రెండ్షిప్ ఎంతో గొప్పదో..వీరి కాంబినేషన్ కూడా అంతే పెద్ద అస్సెట్.
ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ కళ్యాణ్ 15 రోజులు డేట్స్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న.. తాజా షెడ్యూల్ లోనే పవర్ స్టార్కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా ట్రీట్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర తీసుకురాబోతుందని తెలుస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ లో పవన్ యాక్టింగ్ అండ్ పర్ఫామెన్స్ పీక్స్ లోఉండటంతో..మళ్ళీ గబ్బర్ సింగ్ డేస్ గుర్తొచ్చాయి అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.