దేశంలోని పలు రాష్ట్రాల్లో గాలి నాణ్యత మరింత దిగజారుతోంది. పేలవమైన గాలి అనేక వ్యాధులకు దారితీస్తోంది. ఇది ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. శ్వాసతో పాటు, శరీరం నుండి కలుషితమైన, హానికరమైన పొగను బయటకు పంపడం ఊపిరితిత్తుల పని. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉబ్బసం, న్యూమోనియా వంటి అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. కరోనా మహమ్మారి, పెరుగుతున్న కాలుష్యం కారణంగా, ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. కావున ఊపిరితిత్తులు దెబ్బతినకుండా, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ 7 భారతీయ ఆహారాలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకం.
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఇండియన్ ఫుడ్స్
1. వాల్నట్స్
వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైటోఈస్ట్రోజెన్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె, రక్త నాళాలు, ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయపడతాయి.
2. అల్లం
జింజెరాల్ అనే మూలకం అల్లంలో ఉంటుంది. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో ఉండే పోషకాలు ఊపిరితిత్తులలోని ఇన్‌ఫ్లమేషన్స్, ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
3. పాలకూర
పాలకూరలో బీటా కెరోటిన్, జియాక్సంతిన్, ల్యూటిన్, క్లోరోఫిల్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పాలకూర ఆకుల్లోని ఆకుపచ్చ రంగును ఇచ్చే క్లోరోఫిల్ అనేది యాంటీఆక్సిడెంట్ గా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
4. విటమిన్ సి ఉన్న ఆహారాలు
విటమిన్ సి శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ సి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఉసిరి, నిమ్మ, నారింజ మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
5. పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం క్యాన్సర్‌తో పోరాడడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. కర్కుమిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఊపిరితిత్తులలో కాలుష్యం వల్ల వచ్చే వాపు, మంటను నివారించడంలో సహాయపడుతుంది.
6. మెంతులు
మెంతులు ఊపిరితిత్తుల సమస్యలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెంతులు తినవచ్చు. మెంతులు టీ లేదా మెంతి నీటి రూపంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
7. యాపిల్
రోజువారీ ఆహారంలో యాపిల్ ను చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి అనేక పోషకాలు యాపిల్‌లో ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులను, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.