![ఫొటో స్టోరీ: గన్ కాల్చడం నేర్పుతున్న ఉక్రెయిన్ సైన్యం](https://static.v6velugu.com/uploads/2022/03/From youngsters to newly weds Ukrainian civilians turn soldiers to save country amid Russian invasion_85S1ni6lGr.jpg)
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. అణ్వాయుధాలతో పటిష్టంగా ఉన్న రష్యా దూకుడుతనంతో ఉక్రెయిన్లోని ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తోంది. కాగా.. ఏ మాత్రం ఆయుధ బలం లేని ఉక్రెయిన్ కూడా ఎక్కడా తగ్గకుండా, వెన్ను చూపకుండా.. రొమ్ము చూపుతూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ తమ దేశ సైనిక బలాన్ని తాత్కాలికంగా పెంచుకోవడంపై దృష్టి సారించింది.
రష్యన్ బలగాలను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ తమ దేశ యువతను కదనరంగంలోనికి ఆహ్వానించింది. పౌరులకు గన్నులు, బాంబులు, పెట్రో బాంబులు ఇచ్చి.. వాటిని ఎలా వాడాలో నేర్పిస్తున్నారు.
కొంతమంది యువకులకు మెషిన్ గన్స్ ఇచ్చి.. వాటిని ఎలా ఉపయోగించాలో ఓ పాడుబడిన ఇంట్లో నేర్పిస్తున్నారు.
మరికొంతమందికి గ్రనేడ్ ఎలా విసరాలో చేయి పట్టుకొని మరీ తర్ఫీదునిస్తున్నారు.
కొంతమందికి పెట్రోల్ బాంబులు విసరడం ఎలాగో చూపిస్తున్నారు.
కావాలసిన మందు గుండు సామాగ్రిని తయారీ చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు.
చేతిలో గన్ పట్టుకుంది సైనికుడా లేక మాములు పౌరుడా అని గుర్తుపట్టేందుకు ఓ మార్గాన్ని అనుసరిస్తున్నారు. స్ట్రీట్ క్లాత్స్ వేసుకొని, చేతికి పసుపు కలర్ బ్యాండ్ ధరించాలని సూచించారు.
చివరికి యంగ్ లేడీస్కు కూడా కలాష్నికోవ్ తుపాకులు ఇచ్చి టార్గెట్ రేంజ్ ఎలా కాల్చాలో చూపిస్తున్నారు.
కొత్తగా పెళ్లైన జంట సంతోషంగా గడపాల్సిన సమయంలో తమకిచ్చిన తుపాకులతో రోడ్ల వెంట తిరుగుతున్నారు.
అందమైన యువతి చేతి గోళ్లకు రకరకాల నెయిల్ పాలిష్ వేసుకొని చేతిలో గన్ పట్టుకొని ఫొటో ఫోజిచ్చింది. సున్నితమైన తమ చేతులతో గన్ పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పకనే చెబుతోంది.
For More News..