భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్సూపర్వైజర్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని సింగరేణి కాలరీస్వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కొత్తగూడెం జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో మెడికల్అన్ఫిట్ అయిన మైనింగ్, టెక్నికల్ సిబ్బందికి సరైన గౌరవం దక్కడం లేదన్నారు.
హోదాకు తగ్గట్లు సర్ఫేస్ఉద్యోగం కల్పించడం లేదన్నారు. మైనింగ్, టెక్నికల్సిబ్బందిని క్రమశిక్షణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అనంతరం జీఎంను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ధర్నాలో యూనియన్ నాయకులు వీరస్వామి, మల్లికార్జున్‌రావు, కిస్టోఫర్, గట్టయ్య, మధు పాల్గొన్నారు.