వెల్ఫేర్​ హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్

వెల్ఫేర్​ హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్
  • ఇప్పటికే ఆశ్రమ స్కూళ్లలో అమలు
  • త్వరలో హాస్టళ్లలో ఇంప్లిమెంట్ చేసేందుకు సన్నాహాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఉన్న ఫేషియల్ రికగ్నిషన్​ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)​ అటెండెన్స్ ​త్వరలో వెల్ఫేర్ ​హాస్టళ్లలో కూడా అమలు కానుంది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ జిల్లాలోని రెండు ఆశ్రమ స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్​ తీసుకొచ్చారు. త్వరలో అన్ని​ హాస్టళ్లలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుక్​లో అటెండెన్స్​నమోదు చేయడం వల్ల స్టూడెంట్లు, టీచర్లు, మెస్​వివరాలు పక్కాగా తెలిసేవి కాదు. స్టూడెంట్స్​ వివరాలను తప్పుగా నమోదు చేయడం వల్ల అనేక అక్రమాలు జరిగేవి.

ఆశ్రమ స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్​తో అలాంటి అక్రమాలకు చెక్​పడిందని అధికారులు చెబుతున్నారు. ఏ రోజూ ఎంత మంది స్టూడెంట్స్​ హాజరయ్యారు? టీచర్లు ఎంత మంది, ఏ సమయానికి వస్తున్నారు? అనే విషయాలు ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టళ్లలో నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.ప్రస్తుతం వెల్ఫేర్​హాస్టళ్లలో ఎంత మంది స్టూడెంట్స్ ఉంటున్నారనే విషయం అధికారులకు స్పష్టంగా తెలియట్లేదు. అలాగే లేని స్టూడెంట్స్​ను కూడా ఉన్నట్లు చూపించి అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దీంతో వెల్ఫేర్​ హాస్టళ్లలో కూడా ఎఫ్ఆర్ఎస్​ తీసుకొస్తే, వీటన్నింటికి చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంతోనే వెల్ఫేర్​ హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్​ తీసుకురావాలని నిర్ణయించినా... అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు పక్కాగా ఎఫ్ఆర్ఎస్​ తీసుకొస్తే చాలా అవకతవకలకు చెక్ పడే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.