మద్నూర్, వెలుగు: మద్నూర్ మండలంలోని సలాబత్పూర్హనుమాన్ టెంపుల్వరకు పాదయాత్ర చేపట్టిన సుమారు వెయ్యి మంది హనుమాన్భక్తులకు లచ్చన్గేట్వద్ద మైనార్టీ యువ నాయకులు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.
హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని కోరారు. హనుమాన్ సమితికి చెందిన మాజీ సర్పంచ్ రమేశ్దేశాయ్, అజీమ్ పటేల్ ను శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. శాకాపూర్ గ్రామానికి చెందిన అక్తర్, అబ్జల్, ఉస్మాన్, ముబిన్, అహ్మద్, అబ్బు పాల్గొన్నారు.