ఎఫ్​ఎస్​ఏఐ సదస్సు ప్రారంభం

ఎఫ్​ఎస్​ఏఐ సదస్సు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఫార్మా పరిశ్రమల్లో భద్రత పెంపు, అగ్నిప్రమాదాల నివారణపై చర్చించడానికి ఫైర్ అండ్​ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​ఎస్​ఏఐ) చేపట్టిన రెండు రోజుల సదస్సు గురువారం హైదరాబాద్​లో మొదలయింది.  ఈ సందర్భంగా డైరెక్టర్​జనరల్ ​ఆఫ్​ ఫైర్ ​సర్వీసెస్​ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ  ఫార్మాలో, పారిశ్రామిక భద్రతలో అగ్ని ప్రమాదాల నివారణ ముఖ్యమన్నారు.

గత పదేళ్లలో ఫార్మా పరిశ్రమల్లో 97 భారీ అగ్నిప్రమాదాలు జరగ్గా రూ.93 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇటీవల జరిగిన మరో ఘటనలో రూ.30 కోట్ల విలువైన సొత్తు దగ్ధమైందని వివరించారు.  రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ చాలా ఫార్మా కంపెనీలు ఈఎస్​జీ మార్గదర్శకాలను పాటించనందుకు అనేక యూరోపియన్ రెగ్యులేటర్ల నిఘాలో ఉన్నాయని వెల్లడించారు. వాటిని పాటించకుంటే భారత్ నుంచి మాస్యూటికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మానేస్తారని హెచ్చరించారు.