ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఎండీగా రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రావు

ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఎండీగా రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రావు

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్​ఎస్​ఐబీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి తెలుగు వ్యక్తి రామ్మోహన్ రావు అమరను సిఫార్సు చేసింది. ఆయన ప్రస్తుతం బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. బ్యాంకు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా శ్రీనివాసులు శెట్టిని నియమించడం వల్ల ఏర్పడిన ఖాళీని ఆయన భర్తీ చేస్తారు.

ఎస్​బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి 9 మంది అభ్యర్థులను ఎఫ్​ఎస్​ఐబీ ఇంటర్వ్యూ చేసింది.  పనితీరు, మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ రావును ఎంపిక చేసింది.   ఎస్​బీఐ బోర్డుకు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహాయం చేస్తారు. రావు ఎంపికతో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి నాలుగో ఎండీగా రానున్నారు.  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐబి సిఫార్సుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.