
హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో నాలుగు రకాల ఇండియన్ మసాలను నిషేధించిన విషయం తెలిసిందే. MDH మూడు మసాలాలతోపాటు ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో క్యాన్సర్ కు కారణమైయ్యే ఇథిలీన్ ఆకైడ్ కెమికల్ ఉందని ఓ పరిశోధనలో తేలింది. దీంతో వాటిపై సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో నిషేదం విధించాయి. ఈ విషయాన్ని FSSAI సీరియస్‌గా తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మసాల తయారీ యూనిట్లలో విసృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి FSSAI తనిఖీలు చేస్తూనే ఉంది. ఇంకా శాంపిల్ టెస్టింగ్ కొనసాగుతుందని ప్రకటించింది.
ఆ ప్రాడక్ట్స్ విదేశాలతోపాటు ఇండియాలో కూడా చాలామంది వాడుతున్నారు. దీంతో మసాలాల తయారీ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాడక్ట్స్ శాంపిల్ టెస్టులు, క్యాలిటీ చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు పంపింది. ఆహార పదార్థాల తయారీలో వాడే అన్ని పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ అథారిటీ నిఘూ పెట్టింది.