తిరుమలలో ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడిసరుకు నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో భారత ఆహార భద్రత, భద్రతా అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సహకారం తీసుకోవాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు నిర్ణయించారు. సోమవారం ( జులై 15) సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మంలతోఈ అంశంపై చర్చించారు.
తిరుమలలో అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్దాల నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జేఈవో తిరుపతి ఈఓ ఆదేశించారు. FSSAI ముడిసరుకు నాణ్యతను పరిశీలించడమే కాకుండా తక్కువ ధరకు... నాణ్యమైన మెటీరియల్‌లను సేకరించడంలో కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు. ముడిసరుకు సేకరణ కోసం టెండర్లను ఆహ్వానించేటప్పుడు FSSAI సూచించిన నియమాలు .. నిబంధనలను పాటించాలని EO తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియకు కూడా SoP సిద్ధం చేయాలని ఆయన అన్నారు.
ALSO READ | మహా అద్భుతం... ఎంతో మహిమ గల క్షేత్రం... 108 శివలింగాలు.. 108 మారేడు మొక్కలు
తిరుమలలో భక్తులకు అందిస్తున్న జల ప్రసాదం యొక్క నాణ్యత, వంటశాలల లను ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతోందన్నారు. భక్తులకు అందించే అన్న ప్రసాద భవనంలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలో ప్రత్యేకంగా FSSAI ల్యాబ్ ను ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఇవ్వాలని జేఈవోను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు కూడా ఆహారం మరియు నీటి భద్రతా చర్యలపై కొన్ని సిఫార్సులను సమర్పించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ ఫాస్ట్ ట్యాగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ రవీంద్రారెడ్డి, న్యూఢిల్లీలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ బాలు నాయక్, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఈఈ ప్రొక్యూర్‌మెంట్ శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.