
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తన అందం, గ్రామర్ తో కుర్రకారు మనసులు గెలుచుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యింది. అయితే బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రమే బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే 'మేరే హస్కెండికి బీవీ' సినిమాతో తెరపై సందడి చేసింది.
ప్రస్తుతం రకుల్ చేతిలో దే దే ప్యార్ దే2, ఇండియన్ 3 ఉన్నాయి. కాగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జాకీ భగ్నానితో ప్రేమలో పడిన ఈబ్యూటీ.. గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
Also Read:-సీరియల్ హీరోయిన్ ఆటోగ్రాఫ్ తీసుకున్న హీరో నాని..
నేడు (ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025) ఈ చిన్నది తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ' ఇది వరల్డ్ హెల్త్ డే.. మీరు మీ లైఫ్లో రోజువారిగా చేయగలిగే కొన్ని సులభమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటితో మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. బుక్స్ చదివి మీ ఆలోచనలకు పదును పెట్టండి. ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. అది వర్ణించలేని అనుభూతిని ఇస్తుంది. మీకు నచ్చిన ఏదైనా ఆటను ఎందుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. రోజుకు కేవలం 5 నిమిషాలు పెద్ద మార్పులను తీసాయి.
ఎప్పుడూ సరదాగా.. నవ్వుతూ ఉండండి. ఎందుకంటే సంతోషమే మీ ఆరోగ్యానికి బెస్ట్ మెడిసన్. చిన్న అడుగులతో ప్రారంభించి, మీరు ఇప్పటికే ఏమి చేస్తున్నారో.. మీ జీవితంలో మీరు ఏ మార్పులను తీసుకురావాలనుకుంటున్నారో నాకు చెప్పండి. మీరు నిజంగా ఒకే చోట నివసిస్తున్నారని గుర్తుంచుకోండి. అదే మీ శరీరం" అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది.