ముంబై: బ్యాంకుల బ్రాంచుల్లోకి చాలా తక్కువ మంది కస్టమర్లనే అనుమతిస్తున్నప్పటికీ, ఏటీఎంలు మాత్రం ఫుల్‌క్యాష్‌తో కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఏటీఎంలో ఉండే మొత్తం కంటే మూడురెట్లు ఎక్కువగా క్యాష్ నింపుతున్నారు. బ్యాంకుల బ్రాంచుల్లోనూ నగదు కొరత లేకుండా మేనేజ్‌మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణంగా తన ఏటీఎంలో ఉండే మొత్తం కంటే ఇప్పుడు మూడురెట్లు ఎక్కువ క్యాష్ ఉంచుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా 50 శాతం ఎక్కువ మొత్తాన్ని ఏటీఎంలలో నింపింది. తాము కూడా ఎక్కువ క్యాష్‌ను అందుబాటులో ఉంచామని చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫీసర్లు, ఎంత మొత్తం అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
జన్ ధన్ క్యాష్ ట్రాన్స్‌ఫర్లతో మరింత డిమాండ్
లాక్‌డౌన్ వల్ల మహిళలు, వయోధికులు, రైతులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందిపడకుండా జన్‌ధన్ ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏటీఎంల వద్ద తాకిడి పెరిగింది. చాలా మంది బ్యాంకులకు వెళ్లడానికి బదులు ఏటీఎంలపైనే ఆధారపడుతున్నాయి. నోట్లరద్దు సమయం నాటి పరిస్థితిని రానివ్వకుండా ఆర్‌బీఐ చాలా చర్యలు తీసుకుంది. ఇదివరకటి కంటే ఎక్కువ క్యాష్‌ను బ్యాంకులకు పంపింది. ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా బ్యాంకుల వారీగా లెక్కలు తీసి తగిన ఆదేశాలు ఇచ్చింది. క్యాష్ సప్లై విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని, ఏటీఎంలలో తగినంత డబ్బు ఉందని ఏటీఎం ఆపరేటర్ ‘ఎస్‌ఐఎస్’ ఎండీ రుతురాజ్ సిన్హా అన్నారు.