పండ్ల బుట్టకు ఫుల్ డిమాండ్.. ఒక్కరోజే 2500 ఆర్డర్లు

పండ్ల బుట్టకు ఫుల్ డిమాండ్.. ఒక్కరోజే 2500 ఆర్డర్లు

1370చోట్ల ఇంటివద్దకే సరఫరా
హైదరాబాద్‌‌,వెలుగు: మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ శాఖ జీహెచ్ఎంసీ పరిధిలో ‘పండ్లబుట్ట’ పేరుతో ఇచ్చిన ఆఫర్ కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే 2,500 ఆర్డర్లు వచ్చాయి. కాల్ సెంటర్ కు 408 కాల్స్, 70 వాట్సాప్ రిక్వెస్ట్లు వచ్చాయి. ఒక్కరోజే 1,370 చోట్లకు పండ్లు డోర్ డెలివరీ చేశారు. ఆర్డర్ చేసిన 24 గంటల్లో పండ్లు అందుతున్నాయి. కాల్ సెంటర్ లో ఒకటే నంబర్ ఉన్న కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున 73307 33212కు అదనంగా 9114445555 నంబరు ఏర్పాటు చేసినట్లు మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు.

For More News..

హైదరాబాద్లో పెరిగిన వాటర్‌ లెవల్స్.. కారణమేంటో తెలుసా..

లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ