హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

  • ఉద్యోగాలు పోవడంతో టీచర్లకు కొత్త ఉపాధి
  • సబ్జెక్టులు, టైమ్‌ను బట్టి ఫీజు తీసుకుంటున్నరు
  • నెలకు రూ. 3 వేల నుంచి 15 వేల దాకా సంపాదన
  • హైదరాబాద్, టౌన్లలో హోం ట్యూషన్‌ బోర్డులు
  • పేరెంట్స్ కూడా హోం ట్యూషన్లకే ప్రిఫరెన్స్
  • ఉద్యోగాలు పోవడంతో టీచర్లకు కొత్త ఉపాధి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో, టౌన్లలో హోమ్‌‌ ట్యూటర్స్‌‌కు డిమాండ్‌‌ పెరుగుతోంది. ఆన్‌‌లైన్‌‌ క్లాసుల ద్వారా స్కూళ్లు పాఠాలు చెబుతున్నా.. పేరెంట్స్‌‌ హోం ట్యూషన్లను ప్రిఫర్‌‌ చేస్తున్నారు. తమ ఇంటికే ట్యూటర్లను పిలిపించుకొని పాఠాలు చెప్పిస్తున్నారు. కొందరు.. పిల్లలను ట్యూషన్లకు పంపుతున్నారు. ఆన్‌‌లైన్‌‌ క్లాసులతో పిల్లలు బోర్‌‌ అవుతున్నారని, చెప్పిన పాఠాలు వాళ్లకు సరిగ్గా అర్థం కావడం లేదని పర్సనల్‌‌ టీచింగ్‌‌ని ప్రిఫర్‌‌ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు పోయిన ప్రైవేటు టీచర్లలో కొందరికి ఇది ఉపాధి కల్పిస్తోంది. ఇండ్లకు వెళ్లో..  లేక తమ ఇంటికే పిల్లల్ని పిలిపించుకొనో ట్యూషన్లు చెబుతున్నారు. కరోనా వల్ల గతేడాది మార్చి 15 నుంచి స్కూళ్లు మూతబడే ఉన్నాయి. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసులు మొదలయ్యాయి.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాఠాలు అర్థం కాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఇంటరాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేక డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. ఇంటి వాతావరంలో క్లాసులు కాబట్టి కాన్సట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లేదని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నిర్ణయించింది. 9, 10వ తరగతులకే క్లాసులని చెప్పినా చాలా ప్రైవేటు స్కూళ్లు అందరినీ బడికి పిలిచే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం ఇంకా ఉన్నందున చాలా మంది పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిల్లల్ని స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పంపే మూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేరు. కానీ కొద్ది నెలల్లో ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ పిల్లల స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో వర్రీ అవుతున్నారు. ఇంటికే ట్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పిలిపించి పాఠాలు చెప్పిస్తే యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని అనుకుంటున్నారు. దాంతో ఉన్నట్లుండి ట్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగిపోయింది.

జాబ్స్​పోయి అవస్థలు

స్కూళ్లు మూతపడటం వల్ల ప్రైవేటు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్ల పరిస్థితి ఘోరంగా మారింది. జీతాలు లేక అవస్థ పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రైవేటు టీచర్లు ఉంటారు. హైదరాబాద్, చుట్టుపక్కల స్కూళ్లలో 70 వేల మంది వరకు పని చేస్తారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాఠాలు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాక కొంత మందికి ఉద్యోగాలు దొరికాయి. కానీ 90 శాతం కోల్పోయారు. ఫిబ్రవరిలో స్కూళ్లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే మరో పది శాతం మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు అంటున్నాయి. పిల్లలు స్కూళ్లకు రాకపోవడం, కొత్తగా అడ్మిషన్లు లేకపోవడంతో జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నాయి. దీనిపై ప్రైవేటు టీచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అయినా వాళ్లకు ఎలాంటి హామీ దొరకలేదు. పొట్టకూటి కోసం కొందరు చాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్లు, కూరగాయలు, కిరాణా షాపులు పెట్టుకొని నెట్టుకొస్తున్నారు.

స్టూడెంట్ల ఇండ్లకే వెళ్లి..

‘‘మీ ఇళ్లకే వచ్చి పాఠాలు చెబుతాం” అని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి టీచర్లు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడుతున్నారు. క్లాసిఫైడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. ఇండ్ల దగ్గర ‘హోం ట్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ బోర్డులు పెడుతున్నారు. మరోవైపు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసులతో అవస్థలు పడ్డ పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పిల్లలకు ట్యూషన్లు చెప్పించడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుకుంటున్నారు. కొందరు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్కూలు ఫీజులు కట్టినా ట్యూషన్ల కోసం ఖర్చు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. నైన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసుల కోసం కొందరు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రత్యేకంగా హైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. ఇండివీడ్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రూ.2 వేల నుంచి 5 వేల వరకు చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. క్లాస్, సబ్జెక్ట్ వైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నెలకి రూ.3 వేల నుంచి 15 వేల వరకు చార్జ్ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు  పది, పదిహేను మందికి ఒకేసారి ట్యూషన్లు చెబుతూ ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి వెయ్యి వరకు తీసుకుంటున్నారు.

పేరెంట్స్ ఇచ్చే ఫీజులతోనే జీతాలు

ఒక్కో స్కూల్​లో 20 మందికి పైగా టీచర్స్ ఉంటారు. పేరెంట్స్ కట్టే ఫీజుల ద్వారానే వారికి జీతాలిస్తారు. లాక్ డౌన్ లో స్టూడెంట్స్ క్లాసులు మిస్ కావద్దని స్కూల్స్ ఆన్​లైన్ క్లాసులు మొదలుపెట్టాయి. అయితే వాటి వల్ల పేరెంట్స్ సంతృప్తిగా లేరు. మరోవైపు వారి ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు. కానీ వారు ఇచ్చే ఫీజుల మీదే టీచర్స్ ఆధారపడి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ టీచర్స్ వేరే ఉపాధి వైపు వెళ్తున్నారు. కొంత మంది మాత్రమే ట్యూషన్స్ చెబుతూ బతుకుతున్నారు.

– ఉమా మహేశ్వర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్

సైన్స్, మాథ్స్ చెబుతున్నా..

నాకు టీచింగ్ ఫీల్డ్ లో నాలుగేళ్ల
ఎక్స్​పీరియన్స్ ఉంది. ఓ ప్రైవేట్ స్కూల్ లో 5వ క్లాస్ వరకు మాథ్స్, సైన్స్ చెబుతున్నా. లాక్ డౌన్‌‌ టైంలో ఆన్​లైన్ లో హోమ్ వర్క్, వర్క్ షీట్స్ పంపుతున్నాం. అయితే రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. ఫీజులు కట్టించాలని మేనేజ్​మెంట్ మాతో పేరెంట్స్‌‌పై ప్రెజర్‌‌ పెట్టిస్తున్నాయి. కానీ పేరెంట్స్ నుంచి నో రెస్పాన్స్. అందుకే హోమ్ ట్యూషన్స్ చెబుతున్నా. నెల రోజుల నుంచి ఫోర్త్‌‌ క్లాస్ అమ్మాయికి క్లాస్ చెబుతున్నా. నెలకి రూ.5 వేలు వస్తున్నాయి. అలా మొత్తంగా ముగ్గురికి పాఠాలు చెప్తున్నా. ప్రస్తుతానికి నడుస్తోంది.

– మహేశ్, ప్రైవేట్ టీచర్, మణికొండ

నెలకు 8 వేలు కడుతున్నం

మా బాబు ఆరో క్లాస్​. బడులున్నప్పుడు ఈవినింగ్​ ట్యూషన్స్ చెప్పించే వాళ్లం. ఆన్​లైన్ క్లాసుల కోసం ట్యాబ్ కొన్నాం. కానీ బాబుకు ఏం అర్థం కావడం లేదు. మరోవైపు స్కూల్ మేనేజ్‌‌మెంట్లు ఫీజు కట్టాలని ఫోర్స్ చేస్తున్నాయి. ఇబ్బందులున్నా మా బాబు ఫ్యూచర్‌‌ కోసం ట్యూటర్ ని పెట్టాం. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ క్లాసులు చెప్పిస్తున్నాం. ట్యూటర్‌‌ తనకు కుదిరిన టైంలో వచ్చి ఓ 2 గంటలు పాఠాలు చెప్పి వెళ్తారు. నెలకి 8 వేలు ఇస్తున్నాం.

– రాజు, పేరెంట్, జూబ్లీహిల్స్

For More News..

ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో సర్కార్ పనితీరు బాగాలేదు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు