థియేటర్లు ఓపెన్ అయినా ఓటీటీలకు ఫుల్ డిమాండ్

సబ్‌‌‌‌‌‌‌‌స్ర్కిప్షన్‌‌‌‌‌‌‌‌ రేట్లు తగ్గడం, మంచి కంటెంటే కారణం

థియేటర్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌ అయినా ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తిరుగుండదు

ఓటీటీలకు కీలకంగా మారిన ఇండియా

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్, వెలుగు:  సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రసారం చేసే ఓవర్‌‌ ది టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది.  కరోనా ముందు లెవెల్స్​తో పోల్చుకుంటే ఈ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూజర్లు 60శాతం నుంచి 80 శాతం వరకు పెరిగారు.  నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద కంపెనీలకైతే  పెయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూజర్లు డబులయ్యారు. స్పెషల్​ షోలు, సినిమాలతోపాటు, తమ సొంత కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆఫర్ చేస్తూ..ఓటీటీలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల నాటికి నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 25 లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్రయిబర్లు ఉండగా, ప్రస్తుతం  ఈ కంపెనీ కస్టమర్ల బేస్ 50‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షలకు చేరుకొంది. డిస్నీ+హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ల బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి 90 లక్షలకు చేరుకుందని కన్సల్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ మీడియా పార్టనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా అంచనా వేస్తోంది. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటి కంటే ఎక్కువ ఓటీటీలకు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవారు ఎక్కువయ్యారని మీడియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అంటున్నారు. ఎక్కువగా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తుల నుంచి ఓటీటీలకు మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని చెబుతున్నారు.  ఓటీటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చక్కగా అమలు చేస్తున్నాయని ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ సోచీర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది.   కరోనా లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వలన ఈ కంపెనీలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగి,  మంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయని తెలిపింది . థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారు తక్కువగానే ఉన్నారనే విషయాన్ని ఓటీటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అర్థం చేసుకున్నాయని అభిప్రాయపడింది.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఒకే సారి 81 లక్షల మంది 

ఈ నెల ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒకేసారి 81 లక్షల మంది డిస్నీ+హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూశారు.పెద్ద పెద్ద స్టార్లు, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లేకున్నా ఇంత మంది చూడటం విశేషం. కేవలం ధరలను తగ్గిస్తుండడం వలనే కాకుండా మంచి  కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఓటీటీలు ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి.   ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోలు, కొత్త , పాత సినిమాలను కొనుక్కోవడం ద్వారా కస్టమర్లకు వీడియో కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాల్సిన సినిమాలను కూడా కొనుగోలు చేసి అందిస్తున్నాయి. వీ, లక్ష్మీ బాంబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భుజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది ప్రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా వంటి  సినిమాలు ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మంచి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాయి కూడా. పెయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక నుంచి కూడా కొనసాగుతుందని   మీడియాకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శీ అన్నారు. సినిమా థియేటర్లు తిరిగి ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా ఓటీటీలలో సినిమాలు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పెయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కస్టమర్లు కూడా వెనక్కి రాలేరని హంగామా డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా సీఈఓ సిద్ధార్థ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇప్పుడిప్పుడే టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 మార్కెట్లలోకి ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యిందని చెప్పారు. మరింత మంది ఓటీటీలవైపు వస్తారని అన్నారు.

సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ రేట్లు తగ్గిస్తూ..

ఓటీటీల వాడకం మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌లలో పెరిగిందని ఎనలిస్టులు అంటున్నారు. మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ కస్టమర్లను ఆకర్షించేందుకు పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు తమ మంత్లీ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ ధరలను తగ్గిస్తున్నాయి.  ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినప్పుడు  నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌  రూ. 499 కి మంత్లీ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. తర్వాత కేవలం మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ యూజర్ల కోసమే  రూ. 199 మంత్లీ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం ప్రారంభించింది. ఈ ఏడాది జులైలో కంపెనీ రూ. 349 మంత్లీ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌తో హెచ్‌‌‌‌‌‌‌‌డీ కంటెంట్‌‌‌‌‌‌‌‌ను ఆఫర్  చేస్తోంది. ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌‌‌‌‌‌‌‌, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్స్‌‌‌‌‌‌‌‌, ట్యాబ్లెట్స్‌‌‌‌‌‌‌‌  యూజర్ల కోసం తీసుకొచ్చింది. అమెజాన్‌‌‌‌‌‌‌‌  కూడా తమ యాన్యూవల్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌స్రిప్షన్‌‌‌‌‌‌‌‌ను రూ. 999 కే ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. తర్వాత నెలకు రూ. 129   ప్లాన్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది.  ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇండియన్ టెలికాం మార్కెట్‌‌‌‌‌‌‌‌లా కనిపిస్తోందని ఈరోస్‌‌‌‌‌‌‌‌ నౌ సీఈఓ ఆలి హుస్సేన్​ అన్నారు.టెలికాం సెక్టార్​ రేట్లు తరచూ తగ్గుతున్నాయని అన్నారు. ధరలను తగ్గిస్తుండడంతో  కస్టమర్లను ఆకర్షించడంలో ఓటీటీలు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయని చెప్పారు.

రూ.1.86 లక్షల కోట్లకు మీడియా, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్

కరోనా మహమ్మారితో బాగా ఎఫెక్ట్ అయిన ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్టార్ కోలుకుంటుందని, 2021–22 నాటికి రూ.1,86,600 కోట్ల రెవెన్యూని తాకుతుందని కేపీఎంజీ రిపోర్ట్ తెలిపింది. డిజిటల్ అడాప్షన్‌‌‌‌‌‌‌‌ పెరగడంతో వీరి రెవెన్యూలు కూడా పెరగనున్నాయని పేర్కొంది. 2021–22లో ఈ సెక్టార్ 33 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేస్తుందని కేపీఎంజీ ఇండియా పార్టనర్, హెడ్ గిరిష్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది మీడియా అండ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్టార్ 20 శాతం వరకు పడిపోనుందని అంచనావేసింది. 2028 నాటికి  వంద కోట్ల డిజిటల్ యూజర్లకు ఇండియా ఒక హోమ్‌‌‌‌‌‌‌‌గా మారనుందని గిరీష్ పేర్కొన్నారు. కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారం 2019–20లో ఈ రంగం మొత్తం రెవెన్యూ రూ.1,75,100 కోట్లుగా ఉంది. ఇది ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,40,200 కోట్లకు తగ్గనుంది. 2021–22లో రూ.1,86,600 కోట్లకు మీడియా అండ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్టార్ రికవరీ కానుంది. కంటెంట్ ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు మీడియా అండ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెరిగింది. టెక్నాలజీ అడాప్షన్‌‌‌‌‌‌‌‌తో స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో మీడియా అండ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్టార్ కొన్ని ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌లు ఎదుర్కొంది. కరోనా అవుట్‌‌‌‌‌‌‌‌బ్రేక్‌‌‌‌‌‌‌‌తో ఇండియాలో ఎకనమిక్ యాక్టివిటీ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఎంటర్​టైన్​ మెంట్​ ప్లాట్​ఫామ్​లు  తీవ్రంగా నష్టపోయాయి.

For More News..

సీక్రెట్‌గా ఎంసెట్