హంటర్ 350 మోడల్ సేల్స్ 2 లక్షల యూనిట్లను దాటిందని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. ఈ బైక్ లాంచ్ అయిన ఏడాదిలోపే ఈ మైలురాయిని అందుకున్నామని వెల్లడించింది. కిందటేడాది ఆగస్టులో హంటర్ 350 మోడల్‌ను కంపెనీ లాంచ్ చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి లక్ష బండ్లను అమ్మగలిగింది. మరో లక్ష బండ్లను కేవలం ఐదు నెలల్లోనే సేల్ చేసింది.
ఈఎస్‌జీ సేవలకు ఎక్విప్, సెనెకా జాయింట్ వెంచర్
గ్లోబల్ కంపెనీలకు ఎన్విరాన్‌మెంటల్, సోషియల్, గవర్నెన్స్ (ఈఎస్‌జీ) టెక్నాలజీ సొల్యూషన్లను అందించేందుకు ఎక్విప్ సొషియల్ ఇంపాక్ట్, సెనెకాగ్లోబల్ ఐటీ సర్వీసెస్ చేతులు కలిపాయి. రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ సమక్షంలో టీ–హబ్‌లో ఇరు కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అగ్రిమెంట్ ప్రకారం, జాయింట్ వెంచర్‌లో ఎక్విప్‌కు 51 శాతం వాటా ఉంటుంది. మిగిలిన వాటా సెనెకాగ్లోబల్ కంట్రోల్‌లో ఉంటుంది.
ALSO READ :జూన్ క్వార్టర్‌లో .. సైయంట్ లాభం అప్
ఎనిగ్మా ఆంబియర్ ఎన్8 లాంచ్
ఆంబియర్ ఎన్8 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎనిగ్మా ఆటోమొబైల్స్ లాంచ్ చేసింది. ఈ బండి ఫుల్ ఛార్జ్‌పై 200 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2–4 గంటల టైమ్ మాత్రమే పడుతుందని, ధర రూ. 1,05,000 నుంచి రూ.1,10,000 మధ్య ఉందని వెల్లడించింది. ఆంబియర్ ఎన్8లో 1,500 వాట్ కెపాసిటీ గల మోటార్‌ను అమర్చారు. టాప్ స్పీడ్ గంటకు 45–50 కి.మీ.