స్కూల్స్ రీ ఓపెన్.. శానిటైజేషన్‌కు ఫుల్ డిమాండ్

స్కూల్స్ రీ ఓపెన్.. శానిటైజేషన్‌కు ఫుల్ డిమాండ్
  • స్కూల్స్ రీ ఓపెనింగ్ ఉండటంతో పెరిగిన సర్వీసులు
  • కంపెనీలను హైర్ చేసుకుంటున్న మేనేజ్ మెంట్లు
  • క్వాలిటీ, స్పేస్ ను బట్టి ప్యాకేజీలు

హైదరాబాద్, వెలుగు: రీ ఓపెనింగ్ కోసం స్కూల్స్ రెడీ అవుతున్నాయి. గతేడాది మార్చి నుంచి స్కూల్స్ క్లోజ్ లోనే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో రీ ఓపెన్ అవుతుండటంతో అన్ని  క్లాస్ రూమ్ లు, స్కూల్ ప్రాంగణాన్ని మేనేజ్ మెంట్స్  డిస్ ఇన్ఫెక్ట్ స్ప్రేతో శానిటైజ్ చేయిస్తున్నాయి. రీ ఓపెన్ టైమ్ కి  సేప్టీ ప్రికాషన్స్ మస్ట్ గా పాటించాలంటూ ప్రైవేట్, గవర్నమెంట్ స్కూల్స్ కు ఇప్పటికే గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు శానిటైజేషన్ కు గిరాకీ పెరిగింది. లాక్ డౌన్ టైమ్ లో కరోనా భయంతో చాలా మంది ఇండ్లల్లో,ఆఫీసుల్లో శానిటైజ్ చేయించారు. ఆ తర్వాత ఈ సర్వీసులకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ కారణంగా శానిటైజ్ కోసం ఆయా సంస్థలను ప్రైవేట్, గవర్నమెంట్ స్కూల్స్ అప్రోచ్ అవుతున్నాయి.

గైడ్ లైన్స్ నేపథ్యంలో

ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఇన్ స్ట్రక్షన్స్ ప్రకారం స్కూల్స్ మేనేజ్ మెంట్లు వారం, పది రోజుల ముందు నుంచే క్లీనింగ్ పనులు మొదలుపెట్టాయి. ప్రతి స్కూల్ లోని అన్ని క్లాస్ రూమ్స్ ను  క్లీన్ చేయాలని, ఐసోలేషన్ రూమ్ ల ఏర్పాటుతో పాటు శానిటైజేషన్, టెంపరేచర్ చెకప్, సోషల్ డిస్టెన్స్, క్లాస్ రూమ్ లో బెంచ్ కి ఒక్కరే స్టూడెంట్ వంటివి తప్పక పాటించాలని గవర్నమెంట్ గైడ్ లైన్స్ లో పేర్కొంది. గైడ్ లైన్స్ లో శానిటైజేషన్ ను కీలకమని తెలిపింది.  దీంతో అన్ని స్కూల్స్ మెయిన్ గేట్ సహా ప్రతి క్లాస్ రూమ్ వద్ద హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నాయి.  కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు స్టూడెంట్స్ కు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్  నిర్వహిస్తామని మేనేజ్ మెంట్స్ చెప్తున్నాయి.  క్లాస్ రూమ్ లోపలికి, బయటకి వెళ్లేప్పుడు స్టూడెంట్స్ కచ్చితంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కొన్ని స్కూల్స్ మేనేజ్ మెంట్లు అంటున్నాయి.

భారీగా పెరిగిన శానిటైజేషన్ స్టార్టప్ లు

సిటీలో లాక్ డౌన్ టైమ్ లో భారీ ఎత్తున శానిటైజేషన్ స్టార్టప్ లు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున గిరాకీ ఉండటంతో అలా ఏర్పడిన అన్ని కంపెనీలకు చేతి నిండా పని దొరికింది. ఆఫీస్ లు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హోమ్స్ వారు రెగ్యులర్ గా శానిటైజేషన్ చేయించారు. ఇటీవల ఈ సంస్థలకు కాస్త డిమాండ్ తగ్గింది. దీంతో కొన్ని శానిటైజేషన్ సంస్థలను మూసేశారు. కానీ ప్రొఫెషనల్ స్టార్టప్ లు మాత్రం మంచి లాభాల్లోనే నడుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 4,500 ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటికి తోడు గవర్నమెంట్ స్కూల్స్ వేలల్లో ఉన్నాయి. ఈ స్కూల్స్ నుంచి బల్క్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో మళ్లీ బిజినెస్ జోష్ లో ఉందని శానిటైజేషన్ సంస్థల యాజమానులు చెబుతున్నారు.  శానిటైజేషన్ సంస్థలు రిక్వైర్ మెంట్ కు అనుగుణంగా ప్యాకేజ్ లు ప్రకటిస్తున్నాయి. స్కూల్ లో ఉండే ఏరియా,  స్పేస్ ప్రకారం  ప్యాకేజీలు ఉంటాయని శానిటైజేషన్ సంస్థ ప్రతినిధి బాలకృష్ణ తెలిపారు. ఇండ్లకు, ఆఫీస్ లకు అయితే రూ. 1500 ల నుంచి మొదలవుతుందని, స్కూల్స్ కు మాత్రం వేరే విధంగా ధరలు ఉంటాయన్నారు. 10 నెలలుగా స్కూల్స్ మూసే ఉండటంతో ఇక్కడ పని ఎక్కువగా ఉంటుందని స్కూల్ రిక్వైర్ మెంట్ ను బట్టి ప్యాకేజ్ లు ఫిక్స్ చేస్తున్నామంటున్నారు. ఒక్కో ఇంచుకు రూ.1 నుంచి రేట్లు మొదలవుతాయని.. ఒక్కసారి డిస్ ఇన్ఫెక్ట్ చేస్తే మళ్లీ వారం తర్వాత చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. స్కూల్స్ రెగ్యులర్ గా నడిస్తే బిజినెస్ బాగానే ఉంటుందంటున్నారు.

కాల్స్ వస్తున్నాయ్

స్కూల్స్ మేనేజ్ మెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వారం, వారం డిస్ ఇన్ఫెక్ట్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. స్కూల్స్ లో శానిటైజేషన్ కు సెపరేట్ ప్యాకేజ్ లు ఉన్నాయి. రెగ్యులర్ గా వాడే వారికి ఓ రేటు, ఒకేసారి డిస్ ఇన్ఫెక్ట్ చేసుకుంటామంటే ఒక విధంగా రేటు ఫిక్స్ చేశాం. రోజుకి 3 నుంచి 4 ఆర్డర్లు వస్తున్నాయి.

– మధుసూదన్, శానిటైజింగ్ కంపెనీ ఓనర్

బ్రాంచ్ లన్నింటికి…

రీ ఓపెనింగ్ కి  ఏర్పాట్లు చేస్తున్నాం. రవీంద్రభారతి స్కూల్స్ కి సిటీలో 27 బ్రాంచ్ లు ఉన్నాయి. అన్ని బ్రాంచ్ లలో శానిటైజేషన్, డిస్ ఇన్ఫెక్ట్ చేయిస్తున్నాం. ఒకే కంపెనీని హైర్ చేసుకొని ఆర్డర్ ఇచ్చాం. మేనేజ్ మెంట్ రిక్వైర్ మెంట్ ను బట్టి రెగ్యులర్ గా శానిటైజేషన్ చేయిస్తుంది.

– వీరయ్య, హెడ్ మాస్టర్, రవీంద్రభారతి స్కూల్

For More News..

దేశంలోనే మన పోలీసులు బెస్ట్