మన మిర్చికి మస్త్ డిమాండ్.. దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.50వేలు

  • ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు.. దేశీ రకం మిర్చి క్వింటాల్ రూ.50వేలు
  • రూ.24,500 పలికిన వండర్ హాట్ రకం.. తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.22,500
  • ఖమ్మం నుంచి చైనా, బంగ్లాదేశ్​కు ఎక్స్​పోర్ట్

హైదరాబాద్‌‌, వెలుగు :  ఈ ఏడాది మిర్చి పంటకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తుండడమే దీనికి కారణమని అధికారులు చెప్తున్నారు. మొదటి కోత మిర్చి వ్యవసాయ మార్కెట్లకు రావడం మొదలైంది. వరంగల్, ఖమ్మం, మలక్​పేట్​ మార్కెట్​కు వచ్చే మిర్చి ధర మాత్రం భారీగానే పలుకుతున్నది. తక్కువ సాగయ్యే దేశీ రకం మిర్చి డిసెంబర్ 13న క్వింటాల్​కు 50వేలు పలికింది. ఈ సీజన్‌‌లో ఇదే హయ్యెస్ట్ ధర. 20వ తేదీన ఇదే రకం మిర్చి రూ.43వేలకు అమ్ముడు పోయింది. 

అదేవిధంగా, వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్ రూ.24 వేల నుంచి రూ.28 వేల వరకు అమ్ముడుపోయింది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌కు 127 క్వింటాళ్ల వండర్ హాట్ రకం మిర్చి వచ్చింది. క్వింటాల్ రూ.24,500 వరకు పలికిందని రైతులు చెప్పారు. తేజతో పాటు నంబర్ వన్ రకం మిర్చి కూడా మార్కెట్​కు వస్తున్నది. అయితే, సాధారణంగా పాత మిర్చికి ధర ఎక్కువ ఉండేది. కానీ.. ఈ సంవత్సరం కొత్త మిర్చి ధర కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నదని మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు చెప్తున్నారు. దీంతో మిర్చి సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఆశాజనకంగా ధరలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్​లకు రోజు వారీగా సగటున 500 నుంచి వెయ్యి క్వింటాళ్ల మిర్చిని రైతులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ధరలు భారీగానే పలుకుతున్నాయి. తాలు మిర్చి కూడా రికార్డు ధర పలుకుతున్నది. అయితే, ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని మార్కెట్‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌‌‌‌‌‌‌‌ రూ.24,500 వరకు పలికింది. మోడల్‌‌‌‌‌‌‌‌ రేటు రూ.22 వేలు, మినిమమ్‌‌‌‌‌‌‌‌ ధర రూ.20 వేలుగా ఉంది. డిసెంబర్ ప్రారంభం నుంచి ఈ రకం మిర్చి రూ.25వేల నుంచి రూ.28వేల వరకు పలుకుతున్నది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్​కు 1,294 క్వింటాళ్ల తేజ రకం మిర్చి వచ్చింది. గరిష్టంగా క్వింటాల్ రూ.22,500 వరకు పలికింది. మోడల్ ధర రూ.21వేలు, కనిష్టంగా రూ.18వేల ధర నమోదైంది.

నంబర్ వన్ రకం గరిష్టంగా రూ.22వేలు

శుక్రవారం మలక్‌‌‌‌‌‌‌‌పేట్ లోని మహబూబ్‌‌‌‌‌‌‌‌ మాన్షన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ రకం మిర్చి 923 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాల్‌‌‌‌‌‌‌‌ గరిష్టంగా రూ.22వేలు, కనిష్టంగా రూ.14వేలు, మోడల్‌‌‌‌‌‌‌‌ రూ.15వేల చొప్పున ధర పలికింది. శనివారం ఇదే మార్కెట్‌‌‌‌‌‌‌‌కు నంబర్ వన్ రకం మిర్చి 590 క్వింటాళ్లు రాగా.. అదే ధర నమోదైంది. సోమవారం మాత్రం కేవలం 85 క్వింటాళ్లు రాగా, రూ.18వేలు పలికింది. నంబర్‌‌‌‌‌‌‌‌ 2 రకం శుక్రవారం 967 క్వింటాళ్లు, శనివారం 886  క్వింటాళ్లు మార్కెట్​కు రాగా, గరిష్టంగా రూ.13వేల ధర పలికింది. తేజ రకం మిర్చి ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం 1,710 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాల్‌‌‌‌‌‌‌‌ రూ.29వేలు, వరంగల్‌‌‌‌‌‌‌‌లో రూ.22,500 ధర పలికింది.

మార్కెట్‌‌‌‌‌‌‌‌కు పోటెత్తుతున్న మిర్చి

ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌, గుంటూరు నుంచి విదేశాలకు మిర్చి ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ప్రధానంగా ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌ కు చైనా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, ఇండోనేసియా, మలేసియా, వియత్నాం తదితర దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయా దేశాల్లో మన మిర్చి నూనెకు కూడా డిమాండ్ ఎక్కువే ఉంది. ఖమ్మం మార్కెట్​కు ప్రతి రోజూ తేజ రకం మిర్చి వెయ్యి క్వింటాళ్ల వరకు వస్తున్నది. మలక్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ మహబూబ్‌‌‌‌‌‌‌‌ గంజ్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు కూడా మిర్చి వస్తున్నది. సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలోనే ఇలా ఉంటే.. సంక్రాంతి తర్వాత భారీగా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు అంటున్నారు.

తాలు మిర్చి రూ.15వేలు పైనే.. 

తాలు రకం మిర్చికి కూడా డిమాండ్ బాగానే ఉంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో తాలు మిర్చి క్వింటాల్‌‌‌‌‌‌‌‌ అత్యధికంగా రూ.9వేల నుంచి రూ.15,500 వరకు ధర పలికింది. డిసెంబర్ 28న ఖమ్మం మార్కెట్​లో తాలు రకం మిర్చికి గరిష్టంగా రూ.15,500 ధర పలికింది. ఈయేడు ఇదే అత్యధికం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి.