ఏఐ, చాట్​జీపీటీలతో... మస్తు జాబ్స్​.. మస్తు జీతాలు

ఏఐ, చాట్​జీపీటీలతో...  మస్తు జాబ్స్​.. మస్తు జీతాలు

న్యూఢిల్లీ: చాట్​జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్​ వాడకం వేగంగా పెరగడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ, చాట్​జీపీటీలపై పనిచేసే వారికి భారీ జీతాలు వస్తాయని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. ఏఐ ఆధారిత టెక్నాలజీలపై పనిచేసేందుకు ప్రాంప్ట్ ఇంజనీర్లు కావాలి. వీళ్లు మెరుగైన ఫలితాలను అందించడానికి ఏఐ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మార్పులు చేస్తారు. దీనిని ఏఐ కాక్సింగ్​ అంటారు. ఏఐ, చాట్​జీపీటీ వంటి వాటిని సమర్థవంతంగా వాడుకోవడానికి వర్క్​ఫోర్స్​కు శిక్షణ ఇస్తారు.  ప్రాంప్ట్ ఇంజనీర్లు సంవత్సరానికి  3,35,000 డాలర్లు లేదా రూ.2 కోట్ల వరకు సంపాదించవచ్చు.  

వీళ్లు మెసేజ్​లు లేదా ఓపెన్​ఏఐ, చాట్​ జీపీటీ వంటి టూల్స్​ కోసం 'ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు' రాస్తారు. గూగుల్​ పేరెంట్ ఆల్ఫాబెట్ , ఓపెన్​ఏఐ, మెటా ప్లాట్​ఫామ్స్​ సహా అనేక కంపెనీలు లార్జ్​ లాంగ్వేజ్ మోడల్స్​ లేదా ఎల్​ఎల్​ఎంలు అని పిలిచే డజనుకు పైగా ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ లాంగ్వేజ్​ సిస్టమ్స్​ను తీసుకొచ్చాయి. వీటికీ ప్రాంప్ట్​ ఇంజనీర్ల సేవలు కావాలి. ఆంత్రోపిక్  క్లారిటీ వంటి కంపెనీలు ఏఐ టూల్స్​ నుంచి తగినంత అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించడానికి ప్రాంప్ట్ ఇంజనీర్ల సేవలను వాడుకుంటాయి.  మెషిన్ లెర్నింగ్ లేదా ఎథిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు ఉన్న వారికి లేదా ఏఐ కంపెనీలను స్థాపించిన వారికి ఇలాంటి ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి.  

ఏ సబ్జెక్టు చదివినా..

చరిత్ర, తత్వశాస్త్రం, ఇంగ్లీష్ ​సబ్జెక్టులు చదివిన వాళ్లు కూడా ప్రాంప్ట్ ఇంజనీర్లుగా పనిచేయవచ్చని ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కన్సల్టెన్సీ సంస్థ  ముడానోలో ప్రాంప్ట్ ఇంజనీర్  ఆల్బర్ట్  ఫెల్ప్స్ చెప్పారు. తాను, తన కొలీగ్స్​ రోజులో ఎక్కువ భాగం మెసేజ్​లు లేదా ఓపెన్​ఏఐ  చాట్​జీపీటీ వంటి టూల్స్​ కోసం 'ప్రాంప్ట్'లను  రాస్తూ ఉంటామని అన్నారు.  తర్వాత వీటిని ఇతరులు ఉపయోగించేందుకు ఓపెన్​ఏఐ  ప్లేగ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రీసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా సేవ్  చేస్తామని వివరించారు. 

ప్రాంప్ట్ ఇంజనీర్  రోజుకు ఐదు వేర్వేరు ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రాస్తారని  ఫెల్ప్స్ చెప్పారు. ఆంత్రోపిక్, గూగుల్- మద్దతు గల కంపెనీలు శాన్ ఫ్రాన్సిస్కోలో 'ప్రాంప్ట్ ఇంజనీర్  లైబ్రేరియన్' జాబ్స్​కోసం ప్రకటనలు ఇచ్చాయి.  335,000 డాలర్ల వరకు జీతాలను ఆఫర్​ చేస్తున్నాయి. కాలిఫోర్నియాలోని ఆటోమేటెడ్ డాక్యుమెంట్ రివ్యూయర్ క్లారిటీ కూడా  ' మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్’ కోసం 2,30,000 డాలర్ల  వరకు ఇస్తోంది.  టెక్​ కంపెనీలే కాదు ఇతర సంస్థలకు కూడా ఏఐ ఎక్స్​పర్ట్స్​ కోసం చూస్తున్నాయి.